ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రెయింలింగ్‌ను ఢీకొన్న కారు

ABN, Publish Date - May 17 , 2025 | 12:40 AM

కారు రెయిలింగ్‌ను ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. గుల్ల(పిలక) పొగాకు కొనుగోలు చేసే ఐదుగురు వ్యక్తులు శుక్రవారం కారులో జంగారెడ్డిగూడెం వైపు నుంచి జీలుగుమిల్లి వస్తుండగా లక్ష్మీపురం సమీపంలో కారు ప్రమాద వశాత్తు జాతీయ రహదారికి అమర్చిన రెయిలింగ్‌ను ఢీకొంది.

ఒకరి మృతి.. నలుగురికి తీవ్ర గాయాలు

జీలుగుమిల్లి, మే 16: (ఆంధ్రజ్యోతి): కారు రెయిలింగ్‌ను ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. గుల్ల(పిలక) పొగాకు కొనుగోలు చేసే ఐదుగురు వ్యక్తులు శుక్రవారం కారులో జంగారెడ్డిగూడెం వైపు నుంచి జీలుగుమిల్లి వస్తుండగా లక్ష్మీపురం సమీపంలో కారు ప్రమాద వశాత్తు జాతీయ రహదారికి అమర్చిన రెయిలింగ్‌ను ఢీకొంది. దీంతో కారు అదుపు తప్పి తుప్పల్లోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న వారు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణించే ఐదుగురిని 108 వాహనంలో జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలించగా కొయ్యలగూడెం మండలం పర్రింపూడి సర్పంచ్‌ ముప్పిడి విజయకుమారి మరిది ముప్పిడి ప్రసాద్‌ (55) మృతి చెందాడు. గతంలో మృతుడు టైలరింగ్‌ చేస్తూ (టైలర్‌ ప్రసాద్‌) జీవనం సాగించాడు. కొద్ది రోజుల నుంచి గుల్ల(పిలక) పొగాకు కొనుగోలు వ్యాపారం చేస్తున్నాడు. సంఘటన స్థలాన్ని ఎస్సై పి.నవీన్‌కుమార్‌ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - May 17 , 2025 | 12:40 AM