ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తాడేపల్లిగూడెంలోకి.. కాకినాడ బస్సులు రావా ?

ABN, Publish Date - Jul 17 , 2025 | 12:25 AM

జిల్లాలో వాణిజ్య కేంద్రమైన తాడేపల్లిగూడెం పట్టణంలోకి కాకినాడ డిపో నుంచి ఆర్టీసీ బస్సులు రావడం లేదు. ఈ కారణంగా ఇటు విజయవాడ, అటు కాకినాడ వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

బైపాస్‌ నుంచి వెళ్లడంతో ప్రయాణికుల అగచాట్లు

తాడేపల్లిగూడెం రూరల్‌, జూలై 16(ఆంధ్రజ్యోతి):జిల్లాలో వాణిజ్య కేంద్రమైన తాడేపల్లిగూడెం పట్టణంలోకి కాకినాడ డిపో నుంచి ఆర్టీసీ బస్సులు రావడం లేదు. ఈ కారణంగా ఇటు విజయవాడ, అటు కాకినాడ వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో ఆయా ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చే వారు బస్సులు మారాల్సి వస్తోంది. నిత్యం వందలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్థులు తాడేపల్లిగూడెం నుంచి విజయవాడ, కాకినాడ తదితర ప్రాంతాలకు వెళుతుంటారు. రెండేళ్ల క్రితం వరకు ప్రతీ గంటకు తాడేపల్లిగూడెం నుంచి విజయవాడ, కాకినాడ బస్సులు తిరిగేవి. కానీ రోడ్లు బాగుండటం లేదని పట్టణంలోకి రాకుండా హైవే నుంచి దారి మళ్లిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లకు మరమ్మతులు చేపట్టినా బస్సులను ఇటు మళ్లించలేదు. గూడెం డిపో నుంచి బస్సులను పట్టణంలోకి నడపాలని కాకినాడ డిపోకు లేఖలు రాసినా ఫలితం లేకపోయింది. దీంతో అమలాపురం, తణుకు, తాడేపల్లిగూడెం డిపోల బస్సులే ఆధారమయ్యాయి. లేకుంటే రైలు ప్రయాణాలే దిక్కు అని పట్టణ వాసులు వాపోతున్నారు. ‘మా నాన్న విజయవాడలో ఉద్యోగం చేస్తుంటాడు. రోజూ ఉదయం సమయానికి గతంలో కాకినాడ నుంచి వచ్చే బస్సుకు వెళ్లే వారు. సమయం సరిపోయేది. ఇప్పుడు ఆ సమయానికి బస్సు లేకపోవడంతో రోజూ ప్రత్తిపాడు హైవే వద్దకు వెళ్లి అక్కడి బస్సు ఎక్కాల్సి వస్తోంది. కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి. ఇలాగే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాకినాడ డిపో బస్సులు పట్టణంలోకి వస్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి’ అని గూడెంకు చెందిన ఎం.శ్రీకర్‌ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Jul 17 , 2025 | 12:25 AM