సిందూర్ సక్సెస్‌పై బైక్ ర్యాలీ
ABN, Publish Date - May 18 , 2025 | 01:35 AM
ఉగ్రవాద చర్యలకు ప్రతీకారంగా పాకిస్థాన్‌పై భారత్ చేసిన ఆపరేషన్ సిందూర్ దాడులు విజయవంతమయ్యాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు.
భీమవరం రూరల్, మే 17(ఆంధ్రజ్యోతి): ఉగ్రవాద చర్యలకు ప్రతీకారంగా పాకిస్థాన్‌పై భారత్ చేసిన ఆపరేషన్ సిందూర్ దాడులు విజయవంతమయ్యాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. శనివారం భీమవరంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరంగా బైక్ ర్యాలీని నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతం గా తిరంగా యాత్రలో వేలాది మంది పౌరులు పాల్గొన్నారన్నారు. పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పాకిస్థాన్ దురాగతాలను అరికట్టడానికి భారతదేశం కృతనిశ్చయంతో ఉంటుందని, ప్రపంచదేశాలకు భారత దేశం ఆదర్శమని అన్నారు. ర్యాలీలో రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ళ నాగేశ్వరరావు, మునిసిపల్ మాజీ చైర్మన్లు కొటికలపూడి గోవిందరావు, మెరగాని నారాయణమ్మ, టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.
Updated Date - May 18 , 2025 | 01:35 AM