అవినీతి ప్లానింగ్
ABN, Publish Date - Jul 31 , 2025 | 12:28 AM
మునిసిపాలిటీలో టౌన్ ప్లానింగ్ విభాగం అవినీతి ప్లానింగ్ విభాగంగా మారిపోయింది. పట్టణంలో అనుమతి లేని నిర్మాణాలను అడ్డుకోవలసిన పట్టణ ప్రణాళికా విభాగం అఽధికారులు సొమ్ములు డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
భీమవరంలో ఇటీవల ఒక యజమాని భవనంపై చిన్న రూమ్ వేసుకున్నాడు. టౌన్ ప్లానింగ్ అధికారులకు సమాచారం తెలిసింది. వెంటనే అతడితో అధికారులు మాట్లాడి అనుమతి లేనందున తొలగించాలని ఆదేశించారు. ఇంతవరకు బాగానే ఉన్నా సంబంధిత యజమానిని రూ.25 వేలు డిమాండ్ చేశారు. ఈ విషయం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు దృష్టికి వెళ్లింది. మరిన్ని ఆరోపణలు రావడంతో టౌన్‌ప్లానింగ్ అధికారుల వసూళ్ల విషయం రచ్చకెక్కింది.!
అక్రమ నిర్మాణాలే అధికారులకు ఆదాయం
భీమవరం మునిసిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అధికారుల చేతివాటం
అనుమతికి మించి నిర్మాణం చేపడితేసొమ్ములు డిమాండ్
పట్టణంలో నిర్మాణదారుల గగ్గోలు
ఎమ్మెల్యేకు పలువురి లేఖ
అధికారుల తీరుపై ఆగ్రహం
ఏసీబీకి పట్టిస్తానని హెచ్చరిక
భీమవరం టౌన్, జూలై 30(ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీలో టౌన్ ప్లానింగ్ విభాగం అవినీతి ప్లానింగ్ విభాగంగా మారిపోయింది. పట్టణంలో అనుమతి లేని నిర్మాణాలను అడ్డుకోవలసిన పట్టణ ప్రణాళికా విభాగం అఽధికారులు సొమ్ములు డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా అధికారులపై ఆరోపణలు రావడం ప్రజా ప్రతినిధులు హెచ్చరించడం పరిపాటి అయింది. మామూళ్ల ఒత్తిడి తట్టుకోలేనే అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీబీ పట్టిస్తానంటూ హెచ్చరిండమే గాక అధికారుల తీరుపై ఆగ్రహంతో ఊగిపోయారు. టౌన్‌ప్లానింగ్ అధికారులకు సాక్షాత్తు ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు హెచ్చరికలతో ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపింది. పట్టణ ప్రజలు ఎమ్మెల్యే స్పందనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భవన నిర్మాణంలో సెట్ బ్యాక్ వదలకపోవడం, భవనాలపై అదనపు రూమ్‌లు, అనుమతి తీసుకున్న ప్లాన్ కంటే అదనపు అంతస్తుల నిర్మాణం సమాచా రం అధికారులకు అందడమే వారికి పండగ అనే విమర్శలు వస్తున్నాయి. అక్రమ నిర్మాణాలపై సం బంధిత యజమానులను హెచ్చరించి ఎక్కువ మొత్తం సొమ్ములు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. స్లమ్ ఏరియా, సందుల్లో నిర్మాణదారు ల నుంచి ఎక్కువ డిమాండ్ చేస్తున్నారనే ఆరోప ణలు వినిపిస్తున్నాయి. ఎవరైనా నిర్మాణాలపై ఫిర్యాదు చేస్తే అధికారులకు ఆదాయం వచ్చినట్టేనని భావించే పరిస్థితి నెలకొంది. అధికారుల వసూళ్లను తట్టుకోలేని కొంత మంది యజమానులు నేరుగా ఎమ్మెల్యే వద్ద గోడు వెళ్లబోసుకుంటున్నారు.
అవినీతిపై లేఖలు..?
మునిసిపాల్టీలో అవినీతి, వసూళ్లపై కొంత మంది లేఖల ద్వారా ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు దృష్టికి తీసుకెళుతున్నారని పట్టణంలో చర్చనీయాం శంగా మారింది. కొంతమంది నేరుగా కలిస్తే మరి కొందరు లేఖ రాస్తున్నారని ప్రచారం. లేఖల ద్వారా అందిన సమాచారం మేరకే ఎమ్మెల్యే అంజిబాబు టౌన్ ప్లానింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చెయ్యడానికి కారణంగా పలువురు చెబుతున్నారు. టౌన్ ప్లానింగ్‌తో పాటు ఇతర శాఖలపై కూడా లేఖల ద్వారా సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తోంది.
Updated Date - Jul 31 , 2025 | 12:28 AM