ఉప్పుటేరు ప్రక్షాళనకు రూ.500 కోట్లు
ABN, Publish Date - Jul 18 , 2025 | 12:31 AM
ఉప్పుటేరు ప్రక్షాళన, ప్రవాహ వేగాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక సిద్ధం
ప్రభుత్వానికి పంపిన జిల్లా అధికారులు
డ్రెడ్జింగ్‌కు కసరత్తు
ముంపు నివారణపై దృష్టి
ఉప్పుటేరు ప్రక్షాళన, ప్రవాహ వేగాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సముద్రపు నుంచి ఎగదన్నే నీటితో ఉప్పుటేరులోకి ఇసుక మేటలు వేస్తోంది. ఇసుక చేరకుండా అడ్డుగోడ (బ్యాక్ వాటర్ వాల్) నిర్మించే ప్రణాళిక రూపొందించారు. కేవలం నీరు మాత్రమే ఎగదన్ని ఇసుక సముద్ర ముఖ ద్వారం వద్ద ఉండిపోతుంది. దశాబ్దాల నుంచి డ్రెడ్జింగ్ నిర్వహించక ఉప్పుటేరు గర్భం పూడుకుపోయి ప్రవాహ వేగం మందగించింది. ఉప్పుటేరు పరీవాహక భూముల్లో ముంపు సమస్యతో నష్టం వాటిల్లుతోంది. ఉప్పుటేరు ముప్పును తప్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
ఉప్పుటేరు ముప్పు తప్పించడానికి అధికారులు చర్యలు చేప ట్టారు. ప్రవాహ వేగం పెంచడానికి, డ్రెడ్జింగ్‌కు అధికారులు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక సిద్ధం చేశారు. సముద్ర నీరు ఎగదన్నడంతో ఉప్పుటేరులో ఇసుక మేటలు వేస్తోంది. దీనితో అడ్డుగోడ నిర్మాణానికి ప్రతిపాదన చేశారు. దశాబ్దాల నుంచి డ్రెడ్జింగ్ లేకపోవడంతో ప్రవాహం మందగించింది. కొల్లేరు నుంచి వరద నీరు బయటకు వెళ్లాలన్నా డ్రెయిన్ల నుంచి నీరు సక్రమంగా ఉప్పుటేరులో చేరాలన్నా సమస్య ఏర్పడుతోంది. వర్షా కాలంలో డ్రెయిన్లు ఎగదన్ని ఉప్పుటేరు పరీవాహక ప్రాం తాలు ముంపుబారిన పడుతున్నారు. ఆక్వా రంగం దారుణంగా దెబ్బతింటోంది. రైతులు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతున్నా రు. ముంపుబారి నుంచి గట్టెక్కేందుకు ఉప్పుటేరులో పూర్తి స్థాయి డ్రెడ్జింగ్ నిర్వహించాలని సంకల్పించింది. సమగ్ర ప్రాజె క్ట్ నివేదిక (డీపీఆర్) సిద్ధమైంది. డ్రెడ్జింగ్ నిర్వహించేందుకు రూ.500 కోట్లతో నివేదిక ప్రభుత్వానికి సమర్పించారు.
దశాబ్దాల కల
ఉప్పుటేరుతోపాటు, బుడమేరును ప్రక్షాళన చేయాలని ప్రభు త్వం సంకల్పించింది. రెండింటికీ ఏకకాలంలో నిధులు విడుదల చేసేలా జలవనరుల శాఖ కసరత్తు చేస్తోంది. ఉప్పుటేరులో డ్రెడ్జింగ్ చేపడితే ఆకివీడు, కాళ్ల, భీమవరం రూరల్, మొగల్తూ రు మండలాల రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రవాహ వేగం పెరుగుతుంది. జిల్లాలో నాలుగు మండలాల డ్రెయిన్లకు నీరు ఎగదన్నే ముప్పు తప్పుతుంది. సముద్రం నుంచి ఆటు పోట్లు తగ్గుముఖం పడతాయి. ఉప్పుటేరు–సముద్ర ముఖద్వా రం వద్ద కొద్దిపాటి ఎత్తులో అడ్డుగోడను నిర్మించనున్నారు. ఉప్పుటేరు ప్రవాహనానికి అడ్డు ఉండదు. వేసవిలో సముద్రం నుంచి నీరు ఎగదన్నేటప్పుడు ఇసుక రాదు. ఉప్పుటేరులో ఇసు క మేటలు వేయకుండా చిన్నపాటి గోడ (బ్యాక్ వాటర్ వాల్) నిర్మించేలా కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. ప్రభుత్వానికి ప్రాజెక్ట్ నివేదికను పంపారు.
Updated Date - Jul 18 , 2025 | 12:31 AM