ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘బేబీ’కి బాబు గిఫ్ట్‌!

ABN, Publish Date - May 20 , 2025 | 01:31 AM

ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించిన శిశువుల సంరక్షణకు ఉద్దేశించిన ఎన్టీఆర్‌ బేబీ కిట్‌ పథకాన్ని పునరుద్ధరించనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు ప్రభుత్వ నిర్ణ యం వెలువడింది.

ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించిన శిశువులకు పంపిణీ

ఒక్కో కిట్‌ విలువ రూ.1,140.. వైసీపీ హయాంలో నాలుగేళ్లుగా నిలిపివేత

భీమవరం టౌన్‌, మే 19(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించిన శిశువుల సంరక్షణకు ఉద్దేశించిన ఎన్టీఆర్‌ బేబీ కిట్‌ పథకాన్ని పునరుద్ధరించనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు ప్రభుత్వ నిర్ణ యం వెలువడింది. మొత్తం 11 రకాల సామగ్రితో కూడిన బేబీ కిట్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిధులను విడుద ల చేసింది. తొలుత 2016లో ప్రారంభమె ౖన ఎన్టీఆర్‌ బేబీ కిట్ల పథకానికి విశేష ఆదరణ లభించింది. అయితే తదుపరి విధ్వంసకర పాలన, అస్తవ్యస్త నిర్ణయాల తో సమాజంలో శిశువులను సైతం వద లకుండా అందరినీ కుదిపేసిన జగన్‌ ప్రభుత్వం 2019లో ఈ పథకాన్ని నిలిపి వేసింది. మళ్లీ ఇపుడు బేబీ కిట్ల పథకాన్ని ప్రారంభించాలని టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో వందల సంఖ్యలో గర్భిణులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవించిన తల్లుల కు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఒక్కో బేబీ కిట్‌లో దోమతెర, దుప్పటి, స్లీపింగ్‌ బెడ్‌, యాంటీసెప్టిక్‌ లోషన్‌, నాప్‌కిన్‌, డైపర్లు, షాంపూ తదితర 11 రకాల వస్తు సామగ్రి ఉంటుంది. ఒక్కో కిట్‌కు అయ్యే ఖర్చు రూ.1410లను ప్రభుత్వమే భరించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే సమయంలో తల్లులకు ఉచితంగా అందజేస్తుంది. ఈ నిర్ణయంపై గర్భిణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఒక జిల్లా ఆసుపత్రి, నాలుగు ఏరియా ఆసుపత్రులు, ఒక కమ్యూనిటీ ఆసుపత్రి, 32 పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిలో నెలకు వెయ్యికిపైగా ప్రసవాలు జరుగుతుంటాయి.

Updated Date - May 20 , 2025 | 01:31 AM