ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వివాహేతర సంబంధం అనుమానంతో డ్రైవర్‌ను చంపేశారు

ABN, Publish Date - May 24 , 2025 | 12:26 AM

అనుమానమే పెనుభూతమైంది. తన భార్యతో వివాహేతర సంబం ధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో ఆటో డ్రైవర్‌ను మూటలో కట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు.

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కాల్వలో మృతదేహం లభ్యం

పోలీసుల అదుపులో ముగ్గురు

భీమవరం క్రైం, మే 23 (ఆంధ్రజ్యోతి): అనుమానమే పెనుభూతమైంది. తన భార్యతో వివాహేతర సంబం ధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో ఆటో డ్రైవర్‌ను మూటలో కట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఈ సంఘటన భీమవరం పట్టణంలో సంచలనమైంది. వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిన రంగనిపాలెంలో ఉండే కాటూరి దుర్గారావు (28)కు పదేళ్ల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో కొన్నేళ్ల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. వేరే వ్యక్తిని వివాహం చేసుకుంది. దుర్గారావు ఒంటరిగా ఉంటున్నాడు. యాళ్ల కోటేశ్వరరావు (బాబి) వద్ద ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

కొన్నాళ్లుగా దుర్గారావుపై అనుమానం

తన వద్ద ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న కాటూరి దుర్గారావు తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని బాబి అనుమానం పెంచుకున్నాడు. బాబి కూడా షేక్‌ మేరీ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వారిద్దరిపై అనుమానం పెంచుకున్న కోటేశ్వరరావు దుర్గారావును పిలిచి అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దుర్గారావు తాను అలాంటి వాడిని కాదని బాబికి నచ్చజెప్పాడు. అయినా కూడా బాబి కక్ష పెంచుకున్నాడు.

పథకం ప్రకారం హత్య

యాళ్ల బాబి సొంత ఊరు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా వెదిరేశ్వరం. దుర్గారావును అక్కడికి తీసుకువెళ్లి బెదిరించి ఏదో ఒకటి చేయాలని బాబి నిర్ణయించుకున్నాడు. ఈ నెల 4న దుర్గారావును బాబి పని ఉందని ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ బాబి, అతడి భార్య మేరీ, వారి పదహారేళ్ల కుమారుడు కలిసి దుర్గారావుపై దాడి చేశారు. దుర్గారావుకు తీవ్ర గాయా లు కావడంతో వెదురేశ్వరం తీసుకువెళ్లి బెదిరించాలని చూశాడు. దుర్గారావు కాళ్లు, చేతులు, నోరు కట్టి గోనె సంచిలో మూటగట్టారు. అనంతరం బాబి, అతని కుమారుడు కలిసి ఆటోలో వెదిరేశ్వరం తీసుకువెళ్లేందుకు బయలుదేరారు. మార్గమధ్యలో దుర్గారావు కదులుతూ ఉండడంతో సంచిని మరింత గట్టిగా తాడుతో కట్టేశారు. వెదిరేశ్వరం వెళ్లేసరికి దుర్గారావు మృతి చెందాడని నిర్ధారించారు. ఏం చేయాలో తోచని స్థితిలో తండ్రీకొడుకులు దుర్గారావు మృతదేహాన్ని అదే ఆటోలో రావులపాలెం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జొన్నాడ కాలువలో మృతదేహాన్ని విసిరివేశారు. అనంతరం ఏమీ తెలియనట్లు తండ్రీ కొడుకులు వెనక్కి వచ్చేశారు.

సోదరుడి అదృశ్యంపై ఫిర్యాదు

కాటూరి దుర్గారావు ఈ నెల 4 నుంచి కనిపించకపోవడంతో అతడి సోదరుడు నాగరాజు అన్నిచోట్ల వెదికాడు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఈ నెల 21న యాళ్ల బాబిపై అనుమానం వ్యక్తం చేస్తూ వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. బాబి, అతడి భార్య మేరీ, వారి కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో పోలీసులు జొన్నాడ కాలువలో కుళ్లిపోయి ఉన్న మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహానికి రావులపాలెం ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు. తన వద్ద పని చేస్తున్న యువకుడిపై అనుమానం పెంచుకున్న బాబి ఇలా చేయడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి దుర్గారావు బంధువులు, స్నేహితులు పోలీస్‌ స్టేషన్‌ వద్ద నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ధర్నాకు కూడా దిగారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎన్‌.నాగరాజు తెలిపారు.

Updated Date - May 24 , 2025 | 12:26 AM