ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అథ్లెటిక్స్‌ పోటీలకు క్రీడాకారుల ఎంపిక

ABN, Publish Date - Aug 04 , 2025 | 12:12 AM

ఉమ్మడి పశ్చిమ జిల్లాలో అథ్లెటిక్స్‌ పోటీలకు క్రీడాకారులను ఆదివారం ఎంపిక చేశారు. ఏలూరు జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా జట్ల ఎంపిక పోటీలు అల్లూరి సీతారామరాజు స్టేడియంలోనూ, పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్ల అథ్లెటిక్స్‌ పోటీలు తణుకులోని ఎస్సీఐఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరిగాయి.

ఏలూరు జిల్లాలో ఎంపికైన క్రీడాకారులు

ఏలూరు రూరల్‌/తణుకు రూరల్‌, ఆగస్టు3(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి పశ్చిమ జిల్లాలో అథ్లెటిక్స్‌ పోటీలకు క్రీడాకారులను ఆదివారం ఎంపిక చేశారు. ఏలూరు జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా జట్ల ఎంపిక పోటీలు అల్లూరి సీతారామరాజు స్టేడియంలోనూ, పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్ల అథ్లెటిక్స్‌ పోటీలు తణుకులోని ఎస్సీఐఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరిగాయి. ఆయా జిల్లాలో అండర్‌–14, 16, 18, 20 విభాగాలలో బాల బాలికలకు పోటీలు నిర్వహించారు. రన్స్‌, త్రో, జంప్స్‌ పలు ఈవెంట్లలో పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేశారు. ఈ క్రీడాకారులు ఈనెల 9,10,11 తేదీల్లో బాపట్లలో జరిగే రాష్ట్రస్థా యి అథ్లెటిక్స్‌ పోటీల్లో జిల్లాల తరఫున ప్రాతిథ్యం వహిస్తారని ఏలూరు జిల్లా కార్యదర్శి దేవరపల్లిప్రసాద్‌ తెలిపారు. ఏలూరులో పోటీలను ఏలూరు జిల్లా అథ్లెటిక్స్‌ సంఘ అధ్యక్షులు గుళ్లా ప్రసాదరావు, జిల్లా వీరభద్రరావు, మరడాని అచ్యుతరావు, ఎ.శ్రీనివాసరావు ప్రారంభించారు, దేవరపల్లి ప్రసాద్‌ పర్యవేక్షించారు. తణుకులో పోటీలను ప్రాంతీయ వ్యాయామ విద్యా శాఖాధికారి బి. జాన్సన్‌, జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షుడు మానేపల్లి శ్రీనివాస్‌, కార్యదర్శి సంకు సూర్యనారాయణ ప్రారంభించారు. కొమ్మిశెట్టి రాంబాబు, చింతకాయల సత్యనారాయణ, కేవీఆర్‌ సుబ్బారావు, ఆర్‌.నాగేశ్వరరావు, కె. వెంకన్నబాబు, దిలీప్‌, కె.సుజాత, విజయదుర్గ, పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2025 | 12:12 AM