అర్జీలు రీ ఓపెన్ కాకూడదు
ABN, Publish Date - Jun 03 , 2025 | 12:13 AM
‘పీజీఆర్‌ఎస్‌లో అందిన అర్జీల ను రీ ఓపెన్ కాకూడదు. సకాలంలో నాణ్యత తో పరిష్కరించాలి’ అని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశిం చారు.
భీమవరం టౌన్, జూన్ 2(ఆంధ్రజ్యోతి):‘పీజీఆర్‌ఎస్‌లో అందిన అర్జీల ను రీ ఓపెన్ కాకూడదు. సకాలంలో నాణ్యత తో పరిష్కరించాలి’ అని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశిం చారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వ హించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 137 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్యాలయాల చుట్టూ అర్జీదారులు పదే పదే తిరగకుండా చూడాలన్నారు. తన భూమిని సర్వే చేయించి సరిహ ద్దులు చూపాలని ఆకివీడు మండలం కుప్పనపూడికి చెందిన ఎర్రగోగు రామాంజనేయులు కోరారు. ‘అత్తిలి మండలం కంచుమర్రులో పంట బోదె పూడుకుపోయి వ్యవసాయ భూముల కు నీరు రాక అవస్థలు పడుతున్నాం. బోదెలోకి పెట్టిన డ్రెయిన్‌ను తొలగిం చాలి’ అని ఎం.జయప్రసాద్ కోరారు. ‘ఏడేళ్ల క్రితం నా భర్త మతి స్థిమితం లేక ఎక్కడికో వెళ్లిపోయాడు. అప్పటి నుంచి నాకు ఏ ఆధారం లేదు. ఒంట రి మహిళ పింఛన్ మంజూరు చేయిం చండి’ అని తాడేపల్లిగూడెంకు చెందిన బండారు పార్వతి కోరారు. జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో మొగి లి వెంకటేశ్వర్లు, పీజీ ఆర్‌ఎస్ నోడల్ అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడీ డాక్టర్ కేసీహెచ్ అప్పారావు, మేళం దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయంలో..
భీమవరం క్రైం, జూన్ 2(ఆంధ్ర జ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యతను ఇస్తూ అర్జీలు పునరావృతం కాకుం డా నిర్ణీత గడువులోగా పరిష్కరించా లని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు ప్రధానకార్యాలయంలో సోమవారం నిర్వ హించిన ప్రజా సమస్యల పరిష్కారవేదికలో కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భర్త/అత్తారింటి వేధింపులు, భూ–ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్‌లైన్, ప్రేమ పేరుతో మోసాలు తదితర సమస్యలపై ప్రజలు జిల్లాకి 17 అర్జీలను సమర్పించారు. ఏఎస్పీ వి.భీమారావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ వి.పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 03 , 2025 | 12:13 AM