రైల్వేకు ‘అమృత్’
ABN, Publish Date - Jul 18 , 2025 | 12:36 AM
జిల్లాలో తాడేపల్లిగూడెం, భీమవరం టౌన్ రైల్వేస్టేషన్ల అభివృద్ధికి అమృత్ నిధుల వర్షం కురిపిస్తోంది.
తాడేపల్లిగూడెం, భీమవరం టౌన్ స్టేషన్లకు రెండో విడత నిధులు
తాడేపల్లిగూడెం రూరల్, జూలై 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో తాడేపల్లిగూడెం, భీమవరం టౌన్ రైల్వేస్టేషన్ల అభివృద్ధికి అమృత్ నిధుల వర్షం కురిపిస్తోంది. ఈ రెండు స్టేషన్లకు మొదటి విడత రూ.23 కోట్లు విడులకాగా ఈ ఏడాది బడ్జెట్‌లో రెండో విడత నిధులు విడుదల చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 130 స్టేషన్ల అభివృద్ధికి రూ.2981 కోట్లు విడుదల చేశారు. జిల్లాలోని తాడేపల్లిగూడెం, భీమవరం టౌన్ రైల్వేస్టేషన్‌లకు నిధుల కేటాయింపుతో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు సమకూరనున్నాయి. మొదటి విడత నిధులతో ఫ్లాట్‌ఫాం షెల్టర్స్ ఏర్పాటు, పార్కింగ్ స్టాండ్, మోడరన్ ఏసీ టాయిలెట్స్, ఎక్సలేటర్, ఫుట్‌ఓవర్ బ్రిడ్జ్, ఎలివేషన్, డ్రింకింగ్ వాటర్ సిస్టం పనులు పురోగతిలో ఉన్నాయి. తాజా నిధులతో క్వార్టర్స్ ఏర్పాటు, సర్క్యులేటింగ్ ఏరియా, స్టేషన్ మాస్టర్ గది ఏర్పాటు, వీఐపీ లాంజ్ తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
Updated Date - Jul 18 , 2025 | 12:36 AM