అమరావతి జయహో
ABN, Publish Date - May 02 , 2025 | 11:54 PM
రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనుల శంకుస్థాపన మహోత్సవానికి ఉమ్మడి పశ్చిమ నుంచి శుక్రవారం వేలాది గా తరలివెళ్లారు. తెల్లవారుజాము నాటికే అమరావతి వెళ్లే వాహనాలు జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో కన్పిం చాయి.
ఉమ్మడి పశ్చిమ నుంచి తరలి వెళ్లిన వేలాది మంది
ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రులు, ఎమ్మెల్యేలు.. సజావుగా సాగడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనుల శంకుస్థాపన మహోత్సవానికి ఉమ్మడి పశ్చిమ నుంచి శుక్రవారం వేలాది గా తరలివెళ్లారు. తెల్లవారుజాము నాటికే అమరావతి వెళ్లే వాహనాలు జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో కన్పిం చాయి. ఉమ్మడి పశ్చిమ నుంచి ఉదయం ఏడు నుంచి 11 గంటల వరకు ఎడతెరిపి లేకుండా వెల్లువలా సాగాయి. ప్రభుత్వం అమరావతికి వస్తున్న వారిపై ప్రత్యేక శ్రద్ధ కన బర్చింది. ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ ముందస్తు ప్రణాళికతో వ్యవహరించారు. ఎవరికి ఏ లోటు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అమరావతి చేరుకోకముందే అంతా భోజనం ముగించేలా జాగ్రత్తపడ్డారు. ప్రతి నియోజకవర్గం నుంచి వందలాది వాహనాలు బయలుదేరగా ఎప్పటికప్పుడు అందరికీ మజ్జిగ అందిచారు. వాహనాల్లో పెద్దసంఖ్యలో వాటర్ బాటిళ్లను అందుబాటులో ఉంచారు. మంత్రుల నియోజకవర్గాల నుంచి వాహనాలు ఉదయాన్నే ఉమ్మడిగా అమరావతి వైపు బయలుదేరాయి. ఎమ్మెల్యేలు ఇదే క్రమం లో జాగ్రత్తలు తీసుకున్నారు. శుక్రవారం వేడిగాలులు తగ్గి వాతావరణం అనుకూలించడంతో ప్రయాణం సభ జరిగిన తీరు అంతా సాఫీగానే సాగిందని అమరావతికి వెళ్లిన వారంతా సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఊపిరి పీల్చుకున్న నేతలు..
రాజధాని అమరావతి సభకు జిల్లా నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు తరలివెళ్లడమే కాకుండా ఒక క్రమపద్ధతిలో ముందుకు సాగ డం అలాగే వెనుతిరిగి రావడంతో నియోజకవర్గ నేతలు ఎమ్మెల్యేలతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లావ్యాప్తంగా తరలివెళ్లిన వారంతా జరిగిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేయడం అఽధికారులకు నైతిక బలాన్నిచ్చింది. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అధికారులు 150 బస్సులను సమకూర్చారు. కలెక్టర్ నాగరాణి భీమవరంలో అమరావతి వెళ్లే బస్సుకు జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు, డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, పులపర్తి అంజిబాబు, ఆరిమిల్లి రాధాకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్‌ల ఆధ్వర్యంలో పెద్దఎత్తున కార్యకర్తలు మోదీ సభకు పయనమయ్యారు. ఉదయం ఎనిమిది గంటలకే జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి బస్సులు బయలు దేరివెళ్లాయి. గన్నవరం, ఉయ్యూ రులలో భోజన ఏర్పాట్లు చేశారు. అమరావతి పునఃప్రారం భానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేసిన ప్రధాని మోడీని ఆహ్వానించిన వారిలో జిల్లాకు చెందిన ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్‌కు అవకాశం లభించింది. జనసేన తరపున ఆయన హెలిప్యాడ్ వద్ద ప్రధానికి స్వాగతం పలి కిన వారిలో ఉన్నారు. తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యు రాలు తోట సీతారామలక్ష్మి, జిల్లా అధ్యక్షుడు మంతెన రామ రాజు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు వలవల బాబ్జి, పొత్తూరి రామరాజు తమ పార్టీ శ్రేణులతో అమరావతి తరలి వెళ్లారు. జిల్లా నుంచి పెద్ద ఎత్తున సభకు తరలి వెళ్లడంతో కూటమి శ్రేణుల్లో జోష్ నెలకొంది. అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు.
Updated Date - May 02 , 2025 | 11:59 PM