ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

లీజు రద్దు..!

ABN, Publish Date - Jul 27 , 2025 | 12:46 AM

జిల్లాలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, విజ్ఞాన, సేవా కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం లీజును ప్రభుత్వం రద్దు చేసింది.

భీమవరం అల్లూరి సాంస్కృతిక సేవా కేంద్రానికి ప్రభుత్వం షాక్‌

25 ఏళ్ల కాలపరిమితి పూర్తి

నోటీసులు జారీ చేసిన మునిసిపల్‌ అధికారులు

అదే బాటలో శ్రీకృష్ణదేవరాయలు సేవా కేంద్రం

జిల్లాలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, విజ్ఞాన, సేవా కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం లీజును ప్రభుత్వం రద్దు చేసింది. కేంద్ర స్థలాన్ని మునిసిపాలిటీ 25 ఏళ్లకు లీజుకు ఇచ్చింది. లీజు గడువు ముగియడంతో ప్రభుత్వం రద్దు నోటీసులు జారీ చేసింది. పట్టణంలోనే శ్రీకృష్ణ దేవరాయ సేవా కేంద్రం లీజు గడువు కూడా ముగియనుండడంతో ప్రభుత్వం నోటీసులు జారీ చేయనుంది. ఈ రెండు సేవా కేంద్రాల లీజు పునరుద్ధరణకు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుంటున్నట్లు సమాచారం.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

భీమవరం అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం స్థలం లీజును ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వం 25 ఏళ్ల క్రితం భీమవరం రెండో పట్టణంలో స్థలం లీజుకు ఇచ్చింది. ఆ స్థలంలో అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రాన్ని నిర్మించారు. నెలకు రూ.6వేలు చెల్లించేలా కేంద్ర నిర్వాహ కులు మునిసిపాలిటీతో ఒప్పందం చేసుకున్నారు. స్థలం కేటాయించినందుకు పాత బస్టాండ్‌ వద్ద మరో స్థలాన్ని మునిసిపాలిటీకి ఇచ్చినట్టు సాంస్కృతిక కేంద్ర నిర్వాహ కులు చెబుతున్నారు. మునిసిపల్‌ పరిపాలన శాఖ లీజును రద్దు చేస్తూ మునిసిపాలిటీకి ఉత్తర్వులు జారీచేసింది. మునిసిపాలిటీ ఇటీవల అల్లూరి సీతారామరాజు సాంస్కృతి క కేంద్రానికి నోటీసులు ఇచ్చింది.

కేంద్రమంత్రి వర్మ దృష్టికి..

లీజు రద్దు ఉత్తర్వులతో ఉలిక్కిపడిన నిర్వాహకులు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ దృష్టికి తీసుకు వెళ్లారు. లీజు తక్కువగా ఉందన్న అభిప్రాయం అధికార వర్గాల్లో ఉంది. మునిసిపల్‌ పరిపాలన శాఖ కూడా లీజు రద్దు చేయడం పట్టణంలో చర్చకు దారి తీసింది. మునిసి పాలిటీలో పాలకవర్గం ఉంటే ఈ సమస్య ఉండేది కాదు. లీజును పొడిగిస్తూ పాలకవర్గం తీర్మానం చేసేది. ప్రభుత్వం అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకునేది. పాలకవర్గం లేకపోవడం వల్లే లీజు రద్దయిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వ స్థాయిలో రద్దు చేసినా సరే భీమవరం ప్రాంత ప్రజలకు సాంస్కృతిక కేంద్రానికి బలమైన బంధం ఉంది. ఫలితంగా స్థానికంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం లేదు. ఎప్పటిలాగే నిర్వాహకులు సాంస్కృతిక కేంద్రాన్ని నిర్వహించుకునే అవకాశం ఉంది. కానీ లీజు పొడిగింపు కోసం చర్యలు తీసుకోవాలన్న అభిప్రా యం బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వం నుంచే దీనిపై మళ్లీ వివరణ కోరితే అధికారులు ఇక్కడ పరిస్థితులతో నివేదిక పంపేందుకు అవకాశం ఉంటుంది. మళ్లీ లీజు గడువు పెంపు సాధ్యమవుతుంది. అల్లూరి సీతారామరాజు సాంస్కృ తిక కేంద్రం లీజు పొడిగించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఆ దిశగా కృషి చేయాలి. విలీన సమస్యలతో మునిసిపాలిటీకి ఎన్నికలు నిర్వహించలేదు. పాలకవర్గం లేకపోవడంతో లీజు పొడిగింపు తీర్మానం జరగలేదు. దాంతో మున్సిపల్‌ పరిపాలన శాఖ స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు. అదే పాలకవర్గం ఉంటే ఈ సమస్య ఉండేది కాదు.

శ్రీకృష్ణదేవరాయలు సేవా కేంద్రం..?

భీమవరంలో శ్రీకృష్ణ దేవరాయల సేవా కేంద్రం లీజు గడువు కూడా పూర్తి కానుంది. గడువు పెంపుపై ము నిసిపల్‌ పరిపాలన శాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 25 ఏళ్ల క్రితం శ్రీకృష్ణదేవరాయల సేవా కేంద్రానికి స్థలాన్ని కేటాయించడంతో స్థానికులు భవనాన్ని నిర్మించుకున్నారు. లీజు రద్దు నిర్ణయంతో స్థానికంగా వ్యతిరేకత వ్యక్తం కానుంది.

Updated Date - Jul 27 , 2025 | 12:46 AM