ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నా శివుడి అనుమతి లేనిదే..

ABN, Publish Date - Jun 14 , 2025 | 01:00 AM

‘నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడు కూడా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా.. అమాయకుల ప్రాణాలు తీస్తావా..’ అంటూ బాలకృష్ణ తాను నటించిన అఖండ–2 సినిమా డైలాగ్‌ను పలికి అభిమానులను అలరించారు.

ఏలూరులో మాట్లాడుతున్న సినీ హీరో బాలకృష్ణ

అలరించిన బాలకృష్ణ అఖండ–2 డైలాగ్‌

సంయుక్త మీనన్‌తో కలిసి ఏలూరులో సందడి..

ఏలూరు రూరల్‌, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి):‘నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడు కూడా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా.. అమాయకుల ప్రాణాలు తీస్తావా..’ అంటూ బాలకృష్ణ తాను నటించిన అఖండ–2 సినిమా డైలాగ్‌ను పలికి అభిమానులను అలరించారు. ఈ టీజర్‌ విడుదలైన 26 నిమిషాల్లోనే మూడు లక్షల మందికి పైగా ప్రజలు వీక్షించి రికార్డు సృష్టించారని అన్నారు. సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం ఏలూరులో సందడి చేశారు. కొత్త బస్టాండ్‌ సమీపంలో నూతనంగా ఏర్పాటుచేసిన వేగ జ్యువెలర్స్‌ షోరూమ్‌ను సినీ నటి సంయుక్త మీనన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారికి బాలకృష్ణ అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. అభిమానులు గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ‘ఏలూరుతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. మా బంధువులు పెదపాడు మండలం నాయుడుగూడెంలో ఉన్నారు. అలాగే నన్ను చూసేందుకు వచ్చిన మీరంతా నా బంధువులే. ఎన్టీఆర్‌ కడుపున పుట్టడం నా అదృష్టం. ఆయనే బతికుంటే తెలుగు చలనచిత్ర రంగంలో ఇంకా హీరోగానే ఉండేవారు. ఆయన కారణజన్ముడు. సినిమాలతోపాటు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నా. కేంద్ర ప్రభుత్వం నాకు పద్మభూషణ్‌ ఇవ్వడం గర్వంగా ఉంది. మీ అభిమానానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటా’ అంటూ చెప్పారు. అభిమానుల కేరింతలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.

Updated Date - Jun 14 , 2025 | 01:00 AM