ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రమాదాల హైవే

ABN, Publish Date - May 22 , 2025 | 12:23 AM

రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి పోలీస్‌, రవాణా, ఆర్‌ అండ్‌ బి శాఖాధికారులు చర్యలు చేపడుతున్నారు.. ప్రమాదాలు జరుగుతున్నాయి.. ప్రాణాలు పోతున్నాయి.. విధి నిర్వహణలో అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు వేలెత్తి చూపుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యం.. ఆగని మరణాలు..

బ్లాక్‌ స్పాట్‌లు గుర్తించారు

రక్షణ చర్యలు గాలికొదిలేశారు

దూరప్రాంత ప్రయాణికులకు జాతీయ రహదారి మృత్యు మార్గం

రహదారిపై మొబైల్‌ క్యాంటిన్లు

భారీ వాహనాల నిలుపుదల

పోలీసులకు మామూళ్ల మత్తు

అధికారులు పట్టించుకోరు

రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి పోలీస్‌, రవాణా, ఆర్‌ అండ్‌ బి శాఖాధికారులు చర్యలు చేపడుతున్నారు.. ప్రమాదాలు జరుగుతున్నాయి.. ప్రాణాలు పోతున్నాయి.. విధి నిర్వహణలో అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు వేలెత్తి చూపుతున్నారు. ప్రధానంగా 16వ నెంబర్‌ జాతీయ రహదారి హనుమాన్‌ జంక్షన్‌ నుంచి గుండుగొలను వరకూ 40 కిలోమీటర్ల పరిధిలో అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. 8 బ్లాక్‌ స్పాట్స్‌ గుర్తించారు. డేంజర్‌ జోన్‌గా ప్రకటించారు. ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అనేక మంది దివ్యాంగులై భారంగా బతుకీడుస్తున్నారు. నిరంతరం ఈ ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతున్నా.. అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలించినా.. చర్యలు మాత్రం శూన్యం.!

ఏలూరు క్రైం, మే 21 (ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లాలో గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 581 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1500 మంది గాయపడ్డారు. ఎక్కువ మంది 16వ నెంబర్‌ జాతీయ రహదారిపైనే మృత్యువాత పడ్డారు. బ్లాక్‌ స్పాట్‌ ప్రాం తాల్లో ప్రమాదాలు జరుగుతాయని స్థానికులకు పూర్తిస్థాయిలో అవగాహన లేదు. ఇతర రాష్ట్రాల నుం చి లారీలు, కార్లు, బస్సులతో వచ్చే వారికి ఈ ప్రాంతా ల్లో ప్రమాదాలు జరుగుతాయని ఎలా తెలుస్తుందని ప్రశ్న. గతంలో బ్లాక్‌ స్పాట్స్‌ ఉన్న ప్రాంతంలో 500 మీటర్లు దూరం నుంచే ప్రతి వంద మీటర్లకు హెచ్చ రిక బోర్డులను ఏర్పాటుచేసి వాహన డ్రైవర్లను అప్రమ త్తం చేసేవిధంగా చర్యలు చేపట్టారు.

రికార్డులకే పరిమితం..

ప్రస్తుతం అధికారుల రికార్డులకు మాత్రమే బ్లాక్‌ స్పాట్స్‌ నమోదు చేసుకుంటున్నారే తప్ప హైవే పెట్రో లింగ్‌ పోలీసులు ఈ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించిన దాఖలాలు లేవు. సాధారణంగా రోడ్డు ప్రమాదాలు తెల్లవారుజామున, మధ్యాహ్నం, సాయంత్రం చీకటి పడే సమయంలో జరుగుతున్నాయి. ఇలాంటి సమ యంలో బ్లాక్‌ స్పాట్స్‌ వద్ద పోలీసులు తగిన రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంది. జాతీయ రహదారిపై అనధికార హోటళ్లు, దాబాలు ఉండడంతో లారీలు, బస్సులు రహదారిపైనే పార్కింగ్‌ చేస్తున్నారు. ఆగి ఉన్న లారీలను ఢీకొని మృతి చెందిన వారు ఎందరో. తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఎంతోమంది ఇతర రాష్ట్రాల వారు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాల్లో జిల్లాలోని పలువురు మృత్యువాత పడ్డారు. యజమానిని కోల్పోయిన కుటుంబాలు చిన్నా భిన్నం అయిపోయాయి. మరికొంత మంది అవయవాలు కోల్పోయి దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఉన్నతాధికారు తక్షణ చర్యలు చేపట్టి బ్లాక్‌స్పాట్స్‌లో హెచ్చరిక బోర్డులను తక్షణ చర్యలు ఏర్పాటుచేసి ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో హైవే మొబైల్‌ పెట్రోలింగ్‌ పోలీస్‌ గస్తీ ముమ్మరం చేయాల్సి ఉంటుంది. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నియంత్రిస్తామని ప్రకటనలు చేసే ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

రహదారి వెంట మొబైల్‌ క్యాంటీన్లు!

జాతీయ రహదారి వెంట మొబైల్‌ క్యాంటీన్లను ఏర్పాటు చేయడంతో భారీ వాహనాలు రహదారిపై ఆపుతున్నారు. మొబైల్‌ పోలీసులు మామూళ్ల మత్తులో పట్టనట్లు వ్యవహరించడం ప్రమాదాలకు దారితీస్తోంది. గుండుగొలను నుంచి హనుమాన్‌ జంక్షన్‌ వరకూ 8 మొబైల్‌ క్యాంటిన్లు ఉండగా కేవలం దుగ్గిరాల బ్రిడ్జి నుంచి కలపర్రు టోల్‌గేట్‌ వరకూ 4 క్యాంటిన్లు ఉన్నాయి. అమ్మపాలెం క్రాస్‌ రోడ్డు మొబైల్‌ క్యాంటీన్‌ వద్ద రహదారిపై భారీ వాహనాలు నిలపడంతో ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి.

కనబడని హైవే పెట్రోలింగ్‌ వాహనాలు

హనుమాన్‌ జంక్షన్‌ నుంచి గుండుగొలను సెంటర్‌ వరకూ హైవే పెట్రో లింగ్‌కు మూడు వాహనాలను ఏర్పాటు చేశారు. గుండుగొలను సెంటర్‌, ఆశ్రం జంక్షన్‌, కలపర్రు టోల్‌గేటు ప్రాంతాల నుంచి వారి పరిధిలో గస్తీ నిర్వహించాల్సి ఉంది. 12 గంటల డ్యూటీ చొప్పున రెండు షిఫ్ట్‌లుగా పోలీస్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. రాత్రివేళ వాహన డ్రైవర్ల నిద్ర పోగొట్టడా నికి ఫేష్‌వాష్‌, జాతీయ రహదారి వెంబడి హోటళ్లు, దాబాలను రాత్రి 11 గం టలలోపు మూయించడం, రహదారిపై వాహనాలను తీయించడం, వాహ నం మరమ్మతుకు గురైతే ఎన్‌హెచ్‌ఎఐ సిబ్బంది సహకారంతో హెచ్చరిక బోర్డులు, రక్షణ చర్యలు చేపట్టడం, ప్రమాదాల్లో క్షతగాత్రులను హైవే అంబులెన్సులో ఆసుపత్రికి తరలించడం వారి విధులు. ప్రస్తుతం వాటి జాడే లేదు..!

Updated Date - May 22 , 2025 | 12:23 AM