కేసుల పరిష్కారానికి ‘90 రోజుల కార్యక్రమం’
ABN, Publish Date - Jul 09 , 2025 | 12:30 AM
మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి 90 రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైౖర్‌పర్సన్ ఎస్.శ్రీదేవి అన్నారు.
ఏలూరు క్రైం, జూలై 8(ఆంధ్రజ్యోతి):మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి 90 రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైౖర్‌పర్సన్ ఎస్.శ్రీదేవి అన్నారు. ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలో డీఎల్‌ఎస్‌ఏ భవనంలో మంగళవారం ఉదయం మధ్యవర్తిత్వం వహించే న్యాయవాదులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఈ శిక్షణ వల్ల మధ్యవర్తులకు నైపుణ్యం పెంపొందించు కోవడానికి చక్కని అవకాశంగా నిలుస్తుందన్నారు. కక్షిదారులకు త్వరితగతిన పరిష్కారాన్ని అందించవచ్చని న్యాయవాదులు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మెరుగైన సమాజం ఏర్పడడానికి తనవంతు కృషి చేయాలని సూచించారు. రెండో అదనపు జిల్లా జడ్జి యు.ఇందిరా ప్రియదర్శిని మాట్లాడు తూ ఇరుపార్టీలను సమన్వయం చేసి మధ్యవర్తిత్వం నిర్వహించడం ద్వారా కేసులు త్వరితగతిన పరిష్కరించడానికి శిక్షణ కార్యక్రమం ఉపయోగ పడుతుందన్నారు. డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి కె.రత్నప్రసాద్ పలువురు పాల్గొన్నారు.
Updated Date - Jul 09 , 2025 | 12:30 AM