గోదావరిపై 30 కిలో మీటర్ల ప్రయాణం
ABN, Publish Date - May 06 , 2025 | 12:17 AM
నడి నెత్తిన మండుతున్న ఎండలో ఆరుగురు గిరిజన మహిళలు గోదావరిపై 30 కిలో మీటర్ల పడవలో ప్రయాణం చేశారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు పర్యటనలో ఉన్న ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్‌ను కలిసి తమ సమస్యలు మొరపెట్టుకున్నారు.
పోలవరం: నడి నెత్తిన మండుతున్న ఎండలో ఆరుగురు గిరిజన మహిళలు గోదావరిపై 30 కిలో మీటర్ల పడవలో ప్రయాణం చేశారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు పర్యటనలో ఉన్న ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్‌ను కలిసి తమ సమస్యలు మొరపెట్టుకున్నారు. వేలేరుపాడు మండలం పేరంటాలపల్లి గ్రామానికి చెందిన తమకు ఆర్ అండ్ ఆర్ పరిహా రాలు ఇంకా అందలేదని, తమకు ఇష్టంలేని, అందుబాటులో లేని దొరమామిడి గ్రామంలో పునరావాస కాలనీలు కేటాయించారని తెలిపారు. తమకు జీలుగుమిల్లి మండలంలో పునరావాసాలు కేటాయించాలని ఎంపీ మహేశ్‌కు వినతిపత్రం అందించినట్లు పేరంటాలపల్లి గ్రామ మహిళలు తెలిపారు. పేరం టాలపల్లి గ్రామం నుంచి మర పడవపై పోశమ్మగండికి చేరుకున్నామని, అక్కడి నుంచి ఆటోలో పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లినట్లు గిరిజన నిర్వాసిత మహిళలు తెలిపారు. ఆకలితో ఉన్న పేరంటాలపల్లి నిర్వాసిత గిరిజన మహిళల కు మెగా ఇంజనీరింగ్ అధికారులు భోజనం పెట్టించి పంపించారు.
Updated Date - May 06 , 2025 | 12:17 AM