పట్టణాభివృద్ధికి కృషి చేస్తాం
ABN, Publish Date - Apr 26 , 2025 | 12:33 AM
డోన పట్టణా భివృద్ధే ధ్యేయంగా పని చేస్తామ ని మున్సిపల్ చైర్మన సప్తశైల రా జేష్ అన్నారు.
డోన టౌన, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): డోన పట్టణా భివృద్ధే ధ్యేయంగా పని చేస్తామ ని మున్సిపల్ చైర్మన సప్తశైల రా జేష్ అన్నారు. శుక్రవారం పట్ట ణంలోని మున్సిపల్ కార్యాలయం లో కౌన్సిల్ అత్యవసర సమావే శం నిర్వహించారు. సమావేశం లో పురపాలక సంఘం, మున్సిప ల్ పార్కులకు 40 వాట్ల సోలార్ ఎల్‌ఈడీ లైట్లు, పార్కులో జిమ్స్, పిల్లల ఆట పరికరాలు, ఫ్లయిఓవర్ కింద దుకాణాల ఏర్పాటు కోసం రూ.1.60కోట్లు నిధులు మంజూరు మంజూరైనట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని వీధి కుక్కలకు టీకాలు వేయించేందుకు ఆదేశాలు వచ్చాయని తెలిపారు. రూ.99వేల సాధారణ నిధుల నుంచి ఖర్చు చేసేందుకు కౌన్సిల్ ఆమోదించిందన్నారు. సమావేశంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - Apr 26 , 2025 | 12:33 AM