ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పొగాకు రైతులకు అండగా ఉంటాం

ABN, Publish Date - May 26 , 2025 | 11:22 PM

పొగాకు రైతులను ఆదుకునేందకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక పొగాకు బోర్డ్‌ను సందర్శించి పొగాకు ధరలు గతంలో ఎలా ఉన్నాయి. పొగాకు నాణ్యత ఎలా ఉందనే విషయాలను అధికారులు, రైతుల ద్వారా తెలుసుకున్నారు.

పొగాకును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే నారాయణరెడ్డి

వైసీపీలా కంపెనీలు పారిపోయేలా చేయం

వారికి భరోసా ఇస్తాం

ఎమ్మెల్యే నారాయణరెడ్డి

పొదిలి, మే (ఆంధ్రజ్యోతి) : పొగాకు రైతులను ఆదుకునేందకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక పొగాకు బోర్డ్‌ను సందర్శించి పొగాకు ధరలు గతంలో ఎలా ఉన్నాయి. పొగాకు నాణ్యత ఎలా ఉందనే విషయాలను అధికారులు, రైతుల ద్వారా తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శనివారం 11 కంపెనీలకు చెందిన ప్రతినిధులతో మాట్లాడారు. ఆరోజు కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. దీంతో సోమవారం కొనుగోళ్లు ప్రారంభించి నోబిడ్‌లు లేకుండా వేలం నిర్వహించారు. సాధ్యమైనంత వరకు కొనుగోళ్లు చేయించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. లోగ్రేడ్‌ గతంలో తీసుకోవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఎట్టిపరిస్థితితుల్లో లోగ్రేడ్‌ను కొనుగోలు చేయాలని సమస్యలుంటే పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కందుల కంపెనీలకు సూచించారు. నోబిడ్‌లలో 20 నుంచి 24వ తేదీ వరకు 30శాతం నోబిడ్‌లు ఉంటే ప్రభుత్వ సూచనల మేరకు రంగలోకి దిగి 24 నుంచి 26 వరకు కేవలం 5శాతం నోబిడ్‌లు ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. కంపెనీలను సమన్వయం చేసుకుంటూ రోజురోజుకు కొనుగోలు శాతం పెంచుకుంటూ వచ్చామన్నారు. దాన్నిచూసి ఓర్వలేని ప్రతిపక్షం కడుపుమంటగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందన్నారు. వైసీపీలా కంపెనీలు పారిపోయే విధంగా మా ప్రభుత్వం భయాందోళనకు గురిచేయదని కందుల స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో కంపెనీలు పరారైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అనంతరం రైతులతో సమావేశమై సూచనలు సలహాలు తీసుకున్నారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ లోగ్రేడ్‌ కొనుగోలు చేసే విధంగా సహకరిస్తే రైతులు నష్టాల నుంచి బైటపడేందుకు వీలుంటుందన్నారు. రైతులు అధైర్యపడవద్దని మంచి ధర కల్పించి, అన్ని బేళ్లూ కొనుగోలు చేసేలా చూస్తామన్నారు. ఆయన వెంట వేలం నిర్వహనాధికారి గిరిరాజ్‌ కుమార్‌, రైతు సంఘ నాయకులు, రైతులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2025 | 11:22 PM