మా పిల్లలను కాలనీలోనే చదివిస్తాం
ABN, Publish Date - Jul 02 , 2025 | 12:03 AM
మాపిల్లలను బయటి పాఠశాలలకు పంపించమని మాగ్రా మంలోని ప్రాఽథమిక పాఠశాలలోనే చదివించు కుంటామని మిద్దెల ఎస్సీకాలనీ వాసులు మంగ ళవారం ఎంఈవోకు తెలియజేశారు.
ఎక్కడికి పంపించం మిద్దెల ఎస్సీ కాలనీ వాసులు విద్యార్థుల కోసం పోటా పోటీగా ఆటోలు పంపిన ప్రభుత్వ పాఠశాలల వారు
కాశినాయన జులై1(ఆంధ్రజ్యోతి) మాపిల్లలను బయటి పాఠశాలలకు పంపించమని మాగ్రా మంలోని ప్రాఽథమిక పాఠశాలలోనే చదివించు కుంటామని మిద్దెల ఎస్సీకాలనీ వాసులు మంగ ళవారం ఎంఈవోకు తెలియజేశారు. గత ప్రభు త్వం మిద్దెల ఎస్సీకాలనీలోని ప్రభుత ్వ ప్రాఽథమిక పాఠశాలలోగల 3, 4, 5 తరగతులను నర్సాపురం లోని జడ్పీ ఉన్నతపాఠశాలకు అటాచ చేశా రు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ విధానా న్ని రద్ధుచేసి నర్సాపు రంలోని ప్రభుత్వ ప్రాఽథ మిక పాఠశాలను మోడల్ ప్రైమరీ పాఠశాలగా ఎంపిక చేసి అక్కడికి కలిపారు. కానీ ఎక్కువ మంది విద్యార్థుల తల్లిదండ్రులు నర్సాపురం పం పుటకు ఇష్టపడక కాలనీకి సమీపంలోఉన్న మూలపల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు గత 10 రోజులుగా పంపు చున్నారు. దీంతో మూల పల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రదానో పాధ్యాయుడు ప్రత్యేకంగా ఆటో ఏర్పాటు చేశా రు. ఇది గమనించిన నర్సాపురంలోని మోడల్ ప్రైమరీ పాఠశాల ఉపాద్యాయులు మిద్దెల ఎస్సీ కాలనీకి చెందిన విద్యార్థులను నర్సాపురం పాఠ శాలకే పంపాలని తాముకూడా ప్రతిరోజు విద్యా ర్థులకు అటో సౌకర్యం కల్పిస్తామంటూ ముందు కువచ్చారు. ఇందులో భాగంగా మంగళవారం రెండు పాఠశాలలకు సంబంధించిన ఆటోలు విద్యార్థుల కోసం మిద్దెల ఎస్సీకాలనీకి వచ్చాయి. విద్యార్థులను ఎక్కడికి పంపాలో తేల్చుకోలేని వారి తల్లిదండ్రులు కాలనీలో ఉన్న 3, 4, 5 తరగతుల విద్యార్థులను ఎక్కడికీ పంపమని కాలనీలోనే చదువుకొనేలా అవకాశం కల్పించాల ని కోరారు. ఈవిషయంపై ఎంఈవో మాట్లాడు తూ ప్రస్తుతానికి ఇక్కడి 3,4,5 తరగతుల విద్యా ర్థులను నర్సాపురం ప్రైమరీ మోడల్ పాఠశాలకు పంపాలని తల్లిదండ్రులను కోరారు. మీ పాఠశా ల సమస్యను జిల్లా విద్యాశాఖాధికారుల దృష్టి కి తీసుకువెళతానని వారు అనుమతిస్తే ఇక్కడే చదివించుకోవచ్చని తెలిపారు. ఇందుకు ససేమి రా అన్న కాలనీవాసులు పిల్లలను మిద్దెల ప్రాథమిక పాఠశాలలోనే కూర్చోబెట్టడంతో రెండు ఆటోలు వెనుదిరిగి వెళ్లాయి. దీంతో ఉన్న తాధికా రులు ఈసమస్యకు ఎలాంటి పరిష్కారం చూపు తారో వేచిచూడాలి.
Updated Date - Jul 02 , 2025 | 12:03 AM