మహానాడు విజయవంతానికి కృషి చేయాలి
ABN, Publish Date - May 24 , 2025 | 11:54 PM
కడప జిల్లాలో నిర్వహించనున్న మహా నాడు కార్య క్రమాన్ని విజ య వంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మె ల్యే భూమా అఖిల ప్రియ అన్నారు.
ఆళ్లగడ్డ మే 24(ఆంధ్రజ్యోతి): కడప జిల్లాలో నిర్వహించనున్న మహా నాడు కార్య క్రమాన్ని విజ య వంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మె ల్యే భూమా అఖిల ప్రియ అన్నారు. శని వారం ఆళ్లగడ్డ లోని కేవీ సుబ్బారెడ్డి డిగ్రీ కళాశాలలో తెలుగు దేశం పార్టీ క్లస్టర్ ఇనచార్జిలతో ఎమ్మెల్యే సమా వే శం నిర్వహించారు. ముఖ్య అతిఽథిగా పరిశీలకుడు అమర్‌నాఽథ్‌రెడ్డి హాజర య్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈనెల 27,28,29 తేదీల్లో నిర్వహిం చనున్న మహానాడు పండగకు ఆళ్లగడ్డ నుంచి భారీగా నాయకులు, కార్యకర్త లు తరలి రావాలని కోరారు. మహానాడుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై ఎమ్మెల్యే దిశా నిర్దేశం చేశారు. నాయకులు భార్గ వ్‌రామ్, వివిధ మండలాల క్లస్టర్ ఇనచార్జిలు పాల్గొన్నారు.
చదువు చెప్పించే బాధ్యత మాది
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సుబ్బారాయుడు కుమార్తెల చదువు బాధ్యత తాము చూసుకుంటామని ఎ మ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. సుబ్బారాయుడు కుటుంబాన్ని ఎమ్మె ల్యే పరామర్శించారు. టీడీపీ నాయకు డు టీఎనఎల్ పుల్లయ్య విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Updated Date - May 24 , 2025 | 11:54 PM