ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భక్తుల కోసం వాటర్‌ ప్లాంట్లు

ABN, Publish Date - May 26 , 2025 | 12:09 AM

ప్రార్థనా మందిరాలకు వచ్చే భక్తుల దాహార్తి తీర్చడం కోసం కూలింగ్‌ మినరల్‌ వాటర్‌ప్లాంట్ల ను ఏర్పాటు చేస్తున్నట్లు బనగానపల్లె మాజీ సర్పంచ బీసీ రాజారెడ్డి అన్నారు.

వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న బీసీ రాజారెడ్డి

ప్రారంభించిన మాజీ సర్పంచ బీసీ రాజారెడ్డి

బనగానపల్లె, మే 25 (ఆంధ్రజ్యోతి): ప్రార్థనా మందిరాలకు వచ్చే భక్తుల దాహార్తి తీర్చడం కోసం కూలింగ్‌ మినరల్‌ వాటర్‌ప్లాంట్ల ను ఏర్పాటు చేస్తున్నట్లు బనగానపల్లె మాజీ సర్పంచ బీసీ రాజారెడ్డి అన్నారు. పట్టణంలోని దొరకోట మసీదు, బీసీ కాలనీలోని మాసూమ్‌బాషా ఖాద్రి మసీదుల్లో సొంత నిధు లతో ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్లను ఆదివా రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బీసీ రాజారెడ్డి మాట్లాడుతూ పట్టణంలోని 48 పెద్ద, చిన్న ప్రార్థనా మందిరాలు ఉన్నాయ న్నా రు. ఆయా ప్రార్థనా మందిరాలకు చెందిన కొం దరు పెద్దలు తనను సంప్రదించి తాగునీటికి ఇబ్బందిగా ఉందని, మినరల్‌ వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కోరారన్నారు. వారి విజ్ఞప్తి మేరకు తన తల్లిదండ్రులు బీసీ గుర్రెడ్డి, బీసీ లక్ష్మమ్మ దంపతుల జ్ఞాపకార్థం రెండు మసీదు ల్లో మినరల్‌ వాటర్‌ప్లాంట్లను ఏర్పాటు చేశామన్నారు. మినరల్‌వాటర్‌ప్లాంట్లు కావాల్సిన ప్రార్థనా మం దిరాలకు వరుస క్రమం లో ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్నారు. బనగాన పల్లె పట్టణం లోని అన్ని మసీదులు, దేవాల యాలు, చర్చిలకు మా త్రమే ఈ సదుపాయం సొంత ఖర్చులతో కల్పిం చనున్నట్లు తెలిపారు. 100 నుంచి 1500 లీటర్ల కెపాసిటీ గల క్వాలి టీ వాటర్‌ ప్లాంట్లతో పాటు 80 లీటర్ల కెపాసి టీగల బ్లూస్టార్‌ కంపెనీ చెందిన కూలింగ్‌ మిష నలు ఏర్పాటు చేయిస్తానన్నారు. మినరల్‌ వాట ర్‌ ప్లాంట్ల నిర్వహణ, బాధ్యత ఆయా ప్రార్థనా మందిరాల వారే చూసుకోవాలన్నారు. కార్యక్ర మంలో ముస్లింలు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2025 | 12:09 AM