ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నిబంధనలకు నీళ్లు

ABN, Publish Date - Jul 13 , 2025 | 11:45 PM

చెక్‌డ్యాంల నిర్మాణాల్లో నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు.

కేసీకి నీరు వదిలే ఒక రోజు ముందు నిరుపయోగమైన చోట నిర్మాణ పనులు

పొలాల్లో పనిచేసిన చోటే చెక్‌డ్యాంల నిర్మాణాలు పనుల పద్ధతి సరిగా లేదంటున్న వైనం వంతపాడుతున్న అధికారులు

దువ్వూరు, జూలై 13 (ఆంధ్రజ్యోతి):చెక్‌డ్యాంల నిర్మాణాల్లో నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. పొలాల్లో పనిచేసిన చోటే మళ్లీ పనులు చేస్తూ నాణ్యత లేకుండా ఉంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రస్తుత ప్రభుత్వం సాగునీటి సంఘాలను ఏర్పరచి ఆయకట్టు పరిధిలో సాగునీరు సక్రమంగా రైతులకు అందాలనేది లక్ష్యం. అయితే దీనిలో ఎవరంటే వారు పనులు చేయడం అరకొరగా వాటిని మమ అనిపించడం సంబందిత అధికారులు వారికి వంతపాడడంతో లక్ష్యం నీరుగారుతోంది. వివరాల్లోకి వెళితే. మండలపరిధిలోని దువ్వూరు నీటి సంఘానికి నిధులు మంజూరయ్యాయి. మూడు చోట్ల ఈ నిధులతో పనులు చేస్తున్నారు. దువ్వూరు అలుగు వంక ద్వారా ప్రవహించే కాలువకు సంబందించి రూ.9 లక్షలతో, వెలువలి స్లూయిస్‌కు సంబందించి మురళీనగర్‌ వద్ద పొలాల్లో పనిచేసే నిమిత్తం రూ.5 లక్షలు, దువ్వూరు కంబైన్డ్‌ స్లూయిస్‌ దిగువన పొలాల్లో పనులు చేసేందుకు రూ.5 లక్షలు కేటాయించారు. అలుగు వంక దిగువ పొలాల్లో చెక్‌డ్యాం నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాంత రైతులకు దీని నిర్మాణం సమస్యగా మారింది. ఇక్కడ చెక్‌డ్యాం నిర్మాణం వలన తమ పొలాలు ముంపునకు గురవుతాయని రైతులు వాపోతున్నారు. పనులు చేపట్టే విషయం తెలుసుకుని ఈ ప్రాంతంలో భూములు కలిగిన కొందరు రైతులు నిర్మాణ సమయంలోనే వాటికి అభ్యంతరం తెలిపారు. కాగా ఇదే స్థలంలో గతంలో రెండుమార్లు పనులు జరిగినా రైతులకు ఒరిగిందేమీ లేదనేది రైతుల వాదన. మురళీనగర్‌ సమీపంలో వాసుదేవపురంవెళ్లే దారిని ఆనుకుని మరో పనిని చేపట్టి రెండు రోజుల్లో ముగించారు. ఇక్కడ భూముల్లోకి నీరు వెళ్లేందుకు వీలుగా కాలువ ఉందని రైతులు పేర్కొంటున్నారు. దువ్వూరులోని కంబైన్డ్‌ స్లూయిస్‌ దిగువన కాలువలో మరో పని మొదలు పెట్టి సోమవారం కేసీ కాలువకు నీరు వదులుతున్న విషయం తెలిసి చకచకా పనులు చేస్తున్నారు. ఇక్కడ కాలువ గుండా ప్రతి యేటా ఇబ్బంది లేకుండా నీటి సరఫరా జరుగుతోంది. ప్రస్తుతం చేస్తున్న ఈ పని వలన ఎవరికి ఉపయోగమని సమీప పొలాల రైతులు పేర్కొంటున్నారు. మండలంలో ఆయకట్టు పరిధిలో చేయాల్సిన పనులు చాలాఉన్నాయని కొందరు కేవలంబిల్లుల కోసం ఆ పనులను చేసి మమ అనిపిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

ఏఈ ఏమన్నారంటే: దువ్వూరు పరిధిలో జరుగుతున్న మూడు పనులు రైతుల అవసరాలకు అనుగుణంగా చేయిస్తున్నామని దువ్వూరు కేసీ కాలువ ఏఈ పవన్‌కుమార్‌రెడి ్డ పేర్కొన్నారు. రైతుల పొలాలకు నీరు అందడంలేదంటేనే చెక్‌డ్యాం నిర్మించామని మురళీనగర్‌ వద్ద కాలువలో రెండువైపుల నీరు వెళ్లేందుకు ఈ పని చేయించాం. కంబైన్డ్‌ స్లూయిస్‌కింద దిగువ పొలాలకు నీరు వెళ్లేందుకు పని నాణ్యతగా చేయిస్తున్నాం. అధికారులు ఎవరికీ వంతపాడడంలేదని ఈ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.

Updated Date - Jul 13 , 2025 | 11:45 PM