SIT Officials: ముప్పిడి అవినాశ్ సహా ఆ 12 మంది అరెస్టుకు వారెంట్ ఇవ్వండి
ABN, Publish Date - Jul 26 , 2025 | 04:37 AM
మద్యం కుంభకోణంలో మరో 12 మందిని అరెస్టు చేయడానికి వారెంట్ జారీచేయాలని కోరుతూ సిట్ అధికారులు శుక్రవారం ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు.
లిక్కర్ స్కామ్ కేసులో సిట్ పిటిషన్
విజయవాడ, జూలై 25 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో మరో 12 మందిని అరెస్టు చేయడానికి వారెంట్ జారీచేయాలని కోరుతూ సిట్ అధికారులు శుక్రవారం ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌కు చెందిన ముప్పిడి అవినాశ్‌రెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కసిరెడ్డికి తోడల్లుడు. అవినాశ్ సోదరుడు అనిరుధ్‌రెడ్డి, తిరుపతి హౌసింగ్ బోర్టు కాలనీకి చెందిన తుకేకుల ఈశ్వర్ కిరణ్‌కుమార్ రెడ్డి, శ్రీకాళహస్తికి చెందిన ఎస్కే సైఫ్ అహ్మద్, పురుషోత్తం, బొల్లారం శివకుమార్, సైమన్ ప్రసన్, రాజీవ్ ప్రతాప్, కొమ్మారెడ్డి అవినాశ్ రెడ్డి, మోహన్‌కుమార్, అనిల్‌కుమార్ రెడ్డి, సుజల్ బెహ్రూన్‌పై వారెంట్‌కు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై దర్యాప్తు సమాచారాన్ని ఇవ్వాలని సిట్ అధికారులను కోర్టు ఆదేశిస్తూ.. విచారణను 28వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు మద్యం కేసులో నిందితులుగా ఉన్న డి.వాసుదేవరెడ్డి (ఏ2), సత్యప్రసాద్ (ఏ3) ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు ఈనెల 29కి వాయిదా వేసింది. వైసీపీ ప్రభుత్వంలో బేవరేజస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి, ప్రత్యేకాధికారిగా సత్యప్రసాద్ పనిచేశారు.
ఇవి కూడా చదవండి
కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
For More Andhrapradesh News And Telugu News
Updated Date - Jul 26 , 2025 | 04:39 AM