వీఆర్‌ఏలకు పదోన్నతులు కల్పించాలి
ABN, Publish Date - May 10 , 2025 | 11:19 PM
విద్యార్హతల మేరకు వీఆర్‌ఏలకు ప్రభుత్వం పదోన్న తులు కల్పించాలని వీఆర్‌ఏ వెల్ఫేర్ అండ్ సర్వీస్ అసోసియేషన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని కోరారు.
బద్వేలు, మే 10 (ఆంధ్రజ్యోతి): విద్యార్హతల మేరకు వీఆర్‌ఏలకు ప్రభుత్వం పదోన్న తులు కల్పించాలని వీఆర్‌ఏ వెల్ఫేర్ అండ్ సర్వీస్ అసోసియేషన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని కోరారు. శనివారం పట్టణంలోని ఎనజీవో హోం లో రాష్ట్ర కార్యదర్శి గుర్రాల హరిక్రిష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన వీఆర్‌ఏల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వీఆర్‌ఏలకు తక్షణమే ప్రమోషన్లు కల్పించి ఊరట కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందన కొరకు వీఆర్‌ఏలు ఎదురుచూస్తున్నారని ఆర్డీఓ కార్యాలయం నూతనంగా ఏర్పడడంతో పాటు అన్ని తహశీల్దారు కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న అటెండర్ , వాచమెన పోస్టులలో వ్ఠీఆర్‌ఏలను నియమించాలని కోరారు. ఇందుకోసం అధికారులను కలిసి వినతిప్రతాలు ఇవ్వాలని ఈ సమావేశంలో తీర్మాణించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు నల్లిపోగు నాగేషం, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెల్లూరు సురేష్, జిల్లా అధ్యక్షుడు పుల్లయ్య, ప్రధాన కార్యదర్శి నాగసుబ్బయ్య యాదవ్, ఉపాధ్యక్షుడు మణికుమార్, బద్వేలు మండల అధ్యక్షుడు గురవయ్య, కార్యదర్శి రాజేష్‌కుమార్, ఉపాధ్యక్షురాలు నాగరాణి, ఏరియా గౌరవాధ్యక్షుడు వీరశేఖర్ పాల్గొన్నారు.
Updated Date - May 10 , 2025 | 11:19 PM