చెరువులో పడి యువకుడి మృతి
ABN, Publish Date - Jun 30 , 2025 | 12:33 AM
మండలంలోని చినజనార్దనవలసలో ఆదివారం బహిర్భుమికి వెళ్లిన గుళిపల్లి సత్యనారాయణ(31) మృతి చెందాడు.
తెర్లాం, జూన్29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చినజనార్దనవలసలో ఆదివారం బహిర్భుమికి వెళ్లిన గుళిపల్లి సత్యనారాయణ(31) మృతి చెందాడు. ఎస్‌ఐ సాగర్‌బాబు కథనం మేరకు.. సత్యనారాయణ ఆదివారం ఉదయం బహిర్భుమికి వెళ్లాడు. నీళ్ల కోసం గ్రామ సమీపంలోని చెరువుకు వెళ్లిన అతడు అక్కడ మూర్ఛ వ్యాధి వల్ల చెరువులో పడి మృతి చెందాడు. సత్యనారాయణ డిగ్రీ పూర్తి చేశారు. బొబ్బిలిలో గ్రోత్ సెంటర్‌లో మెకానిక్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. సత్యనారాయణకు తల్లిదండ్రులతో పాటు సోదరుడు ఉన్నారు. తల్లి దండ్రుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. మృతుడికి వివాహం కాలేదు.
Updated Date - Jun 30 , 2025 | 12:33 AM