Yogandhra on the coast of Chintapalli చింతపల్లి తీరంలో యోగాంధ్ర
ABN, Publish Date - Jun 06 , 2025 | 11:50 PM
Yogandhra on the coast of Chintapalli చింతపల్లి బీచ్‌లో శుక్రవారం ఉదయం చేపట్టిన యోగాంధ్ర విజయవంతమైంది. సుమారు 300 మందికి పైగా కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్ అంబేడ్కర్ హాజరై పలు యోగాసనాలు వేశారు.
చింతపల్లి తీరంలో యోగాంధ్ర
హాజరైన కలెక్టర్ అంబేడ్కర్
పూసపాటిరేగ, జూన్6(ఆంధ్రజ్యోతి): చింతపల్లి బీచ్‌లో శుక్రవారం ఉదయం చేపట్టిన యోగాంధ్ర విజయవంతమైంది. సుమారు 300 మందికి పైగా కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్ అంబేడ్కర్ హాజరై పలు యోగాసనాలు వేశారు. వివిధశాఖల జిల్లా అధికారులు, మండల అధికారులు, మండలానికి చెందిన ఆరోగ్యశాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు, పంచాయతీరాజ్, రెవెన్యూశాఖ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజూ యోగా చేయాలని సూచించారు. కాగా యోగాపై అవగాహన పరిచేందుకు ఇసుకతో తీరంలో నిర్మించిన సైకతశిల్పం అందరినీ ఆకట్టుకుంది.
ఫ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవితో పాటు కొందరు జనసేన పార్టీ నాయకులు హాజరుకాలేదు. తెలుగుదేశంపార్టీ నాయకులు కూడా హాజరుకాలేదు. దీనిపై తెలుగుదేశంపార్టీ నాయకులు మీడియా సమావేశంలో స్పందిస్తూ స్థానిక అధికారులు తమకు సమాచారం ఇవ్వకపోవడంతో తెలియక హాజరుకాలేకపోయామన్నారు.
------------
Updated Date - Jun 06 , 2025 | 11:50 PM