ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉనికిని కాపాడుకోడానికే వైసీపీ విమర్శలు

ABN, Publish Date - Aug 03 , 2025 | 11:16 PM

ప్రజలు తమ పార్టీని పూర్తిగా మరిచిపోయే పరిస్థితి వచ్చిందని, ఈ పరిస్థితుల్లో తమ ఉనికిని కాపాడుకోడానికే వైసీపీ నా యకులు లేనిపోని విమర్శలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున తెలిపారు.

మాట్లాడుతున్న నాగార్జున:

చీపురుపల్లి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ప్రజలు తమ పార్టీని పూర్తిగా మరిచిపోయే పరిస్థితి వచ్చిందని, ఈ పరిస్థితుల్లో తమ ఉనికిని కాపాడుకోడానికే వైసీపీ నా యకులు లేనిపోని విమర్శలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున తెలిపారు. ఆదివారం చీపురుపల్లిలో ఆయన విలేకరులతో మా ట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో సుమారు 80 శాతం ఇప్పటికే అమలుచేసినట్లు తెలిపారు. తల్లికి వందనం, ఉచిత గ్యాస్‌, అన్నదాత సుఖీభవ పథకాలు అమలయ్యాయని చెప్పారు. ఈనెలలోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు.ప్రభుత్వ పాలనతో రాష్ట్ర ప్రజలు సంతృప్తి చెందుతున్నారని, అయితే, వైసీపీ నాయకులు మాత్రం అబద్దాలు మా ట్లాడుతూ, ప్రభుత్వంపై బురద జల్లడానికి చూస్తున్నారన్నారు. ప్రతిపక్ష నాయ కులు ఎన్ని మాయలు చేసినా, నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని నాగార్జున అన్నా రు. వైసీపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు, ఎటువంటి హామీలు ఇవ్వకపోయినా, గత ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని నిర్ణయించుకున్నారని, ఈ విషయాన్ని ఇప్పటికైనా వైసీపీ నాయకులు గ్రహించాలని నాగార్జున కోరారు.

Updated Date - Aug 03 , 2025 | 11:16 PM