Stock Will Be Refilled or Not! మళ్లీ స్టాక్ వస్తుందో.. లేదోనని!
ABN, Publish Date - Jul 08 , 2025 | 10:52 PM
Worried Whether the Stock Will Be Refilled or Not! ఖరీఫ్ రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. వరి ఉడుపులు ప్రారంభ దశలో ఉండడంతో యూరియా, ఎరువుల కోసం పరుగులు పెడుతున్నారు.
పీఏసీఎస్ వద్ద నిరీక్షిస్తున్న రైతులు
మక్కువ, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. వరి ఉడుపులు ప్రారంభ దశలో ఉండడంతో యూరియా, ఎరువుల కోసం పరుగులు పెడుతున్నారు. మంగళవారం మక్కువ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్దకు లారీ లోడ్‌తో యూరియా స్టాక్ వచ్చింది. దీంతో రైతులు క్యూలైన్‌లో గంటలకొద్దీ నిరీక్షించారు.యూరియా, డీఏపీ కోసం కొందరు ఉదయం నుంచి సాయంత్రం వరకూ వేచి ఉన్నారు. కొన్ని చోట్ల రైతు మీసేవా కేంద్రాల్లో ఎరువులు అందజేస్తున్నా మళ్లీ స్టాక్ వస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Updated Date - Jul 08 , 2025 | 10:52 PM