ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తాగునీటిలో పురుగులు

ABN, Publish Date - Jun 22 , 2025 | 11:29 PM

బొబ్బిలిలోని పలు వార్డు ల్లో మునిసిపల్‌ కుళాయిల నుంచి వస్తున్న తాగునీటిలో పురుగులు దర్శనమిస్తున్నాయని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

కుళాయిల నుంచి వచ్చిన నీటిలో పురుగులు కనిపిస్తున్న దృశ్యం

బొబ్బిలి, జూన్‌ 22 (ఆంధ్ర జ్యోతి): బొబ్బిలిలోని పలు వార్డు ల్లో మునిసిపల్‌ కుళాయిల నుంచి వస్తున్న తాగునీటిలో పురుగులు దర్శనమిస్తున్నాయని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. చినబజారు జంక్షన్‌లో తాగు నీటిలో పురుగులు కనిపిస్తున్నాయని పలువురు వాపోతున్నారు. ఈనీటిని తాగితే వ్యాధులు ప్రబలే అవకాశముందని చెబుతున్నారు. పట్టణ ప్రజలకు తాగునీరందించే రిజర్వాయర్లను పరిశుభ్రం చేయకపో వడంతో పురుగులు వస్తున్నాయని పలువురు చెబుతున్నారు. మునిసిప ల్‌ కార్యాలయంలో వినియోగించే నీరు దుర్గంధ పూరితంగా ఉంటోంద ని, ఈ విషయంపై ఎవరూ పట్టించుకోవడం లేదని కౌన్సిలర్లు చెబుతు న్నారు. ప్రతిరోజూ క్లోరినేషన్‌ చేయించి ప్రజలకు తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంది. పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో క్లోరినేషన్‌ సైతం చేయడంలేదన్న విమర్శలొస్తున్నాయి. గతంలో నాచుపట్టి, చెత్తతో తాగు నీటి రిజర్వాయర్‌ ఉండడాన్ని మునిసిపల్‌ ప్రజాప్రతినిధులు గుర్తించిన విషయం విదితమే. ప్రస్తుత వర్షాకాలంలో రక్షిత మంచినీటిని అందజేయకపోతే ప్రజలు వ్యాధులు బారినపడే ప్రమాదముందని కౌన్సి లర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాగా బొబ్బిలిలో కుళాయిల ద్వారా పరిశుభ్రమైన తాగునీటిని సరఫరా చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని మునిసిపల్‌ కమిషనరు లాలంరామలక్ష్మి తెలిపారు. క్లోరినేషన్‌ సక్రమంగా చేపట్టాలని సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు చెప్పారు. పైపులైన్‌ లీకేజీలతో ఏర్పడే సమస్యలు పరిష్కరించాలని డీఈఈ, ఏఈలను ఆదేశించామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

Updated Date - Jun 22 , 2025 | 11:29 PM