విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి
ABN, Publish Date - Jun 10 , 2025 | 12:40 AM
బొబ్బిలి ఏపీఐఐసీ గ్రోత్ సెంటర్‌లోని బెర్రీ ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమకు చెందిన వెల్డింగ్ కార్మికుడు మహ్మద్ డిల్డార్ అన్సారీ (25) సోమవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు.
బొబ్బిలి, జూన్9 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి ఏపీఐఐసీ గ్రోత్ సెంటర్‌లోని బెర్రీ ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమకు చెందిన వెల్డింగ్ కార్మికుడు మహ్మద్ డిల్డార్ అన్సారీ (25) సోమవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లా కలిమండి సమితి అలీమెహెల్లా గ్రామానికి చెందిన రుస్తుం అన్సారీ కుమారుడు డిల్డార్ అన్సారీ ఇక్కడి పరిశ్రమలో వెల్డింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సోమవారం విద్యుదాఘాతానికి గురికావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఎస్‌ఐ రమేశ్ ఆధ్వర్యంలో పోలీసు లు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇదే పరిశ్రమలో అన్సారీ సోదరుడు పనిచేస్తున్నాడు. పోలీసులు ఆయన నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. స్థానిక ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తర లించి కేసు నమోదు చేశారు.
Updated Date - Jun 10 , 2025 | 12:40 AM