ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Work with money! పైసలుతోనే పని!

ABN, Publish Date - May 15 , 2025 | 11:51 PM

Work with money! ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రెవెన్యూ శాఖ తీరు మారడం లేదు. లంచం ఇవ్వనిదే పని చేయడం లేదు. ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించేశారు. కిందిస్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి అధికారుల వరకు ఇదే యవ్వారం.

పైసలుతోనే పని!

ఏసీబీ కేసులకు బెదరని రెవెన్యూ

అడిగినంత చేతిలో పెడితేనే కదలిక

నేతలు చెప్పినా ఎంతోకొంత ఇవ్వాల్సిందే

అధికారమెవరిదైనా మారని తీరు

- తల్లి పేరున ఉన్న భూమిని తన పేరున మార్చుకొనేందుకు (మ్యూటేషన్‌) జామి మండలం అలమండ గ్రామానికి చెందిన మిడతాన వెంకట సత్యఅప్పలనాయుడు ఇటీవల రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకు రెవెన్యూ అధికారి లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో ఆ రైతు ఏసీబీని ఆశ్రయించాడు. వారు ఇచ్చిన ప్రణాళిక ప్రకారం రైతు నుంచి లంచం తీసుకుంటున్న వీఆర్వోను మంగళవారం రాత్రి ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

- ఎకరా లోపు భూమికి పట్టాదారు పాసుపుస్తకం(మ్యూటేషన్‌) చేసేందుకు సర్వేయరొకరు రైతును రూ.10వేలు అడిగారు. ఈవిషయం తెలుసుకున్న ప్రజాప్రతినిధి ఒకరు తాను చెప్పినా డబ్బులు అడుగుతారా? అంటూ మండల స్థాయి రెవెన్యూ అధికారికి అందరి ముందే ఫోన్‌ చేసి మరీ నిలదీశారు. అయినా కొంత చేతిలో పెడితేనే తప్ప పని కాలేదు.

- ఓ గ్రామానికి చెందిన అసైన్డ్‌ భూముల్లో సగానికి పైగా చేతులు మారాయి. గత వైసీపీ ప్రభుత్వం ఆ భూములన్నింటినీ ఫ్రీహోల్డ్‌ (చట్టబద్ధత) చేసేసింది. నిబంధనల ప్రకారమైతే ఆ భూములు పీవోటీ కింద రెవెన్యూ అధికారులు చూపాలి. చట్టబద్ధత కల్పించడం వీలు కాదు. ఇందుకు విరుద్ధంగా ఓ మండల స్థాయి రెవెన్యూ అధికారి చక్రం తిప్పారు. ఫ్రీహోల్డ్‌ జరిగిన వెంటనే భూములను కొనుగోలు దారుల పేరున రిజిస్ట్రేషన్‌ చేసేలా ఒప్పందం కుదిర్చారు. అప్పటి ప్రజాప్రతినిధి సహకారంతో రూ.కోట్లలో లబ్ధిపొందారు. అసైన్డ్‌ పట్టా ఉన్న రైతుకు మాత్రం ఎకరాకు రూ.50వేలతో సరిపెట్టారు.

- ఓ రైతు తనకున్న ఎకరా భూమిని విక్రయించాలనుకున్నాడు. జాయింట్‌ ఎల్‌పీఎంగా ఉన్నందున స్థానిక రెవేన్యూ అధికారిని కలిశాడు. తన భూమిని విడదీసి చూపించాలని కోరాడు. దీనికి కూడా రెవెన్యూ అధికారులు డబ్బులు డిమాండ్‌ చేశారు. ఎంతోకొంత చేతిలో పెట్టిన తరువాతే ఫైల్‌ను కదిపారు.

శృంగవరపుకోట/ విజయనగరం క్రైం, మే 15 (ఆంధ్రజ్యోతి):

ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రెవెన్యూ శాఖ తీరు మారడం లేదు. లంచం ఇవ్వనిదే పని చేయడం లేదు. ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించేశారు. కిందిస్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి అధికారుల వరకు ఇదే యవ్వారం. లంచం అడిగితే అవనీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు ఫిర్యాదు చేస్తారన్న భయం కూడా కనిపించడం లేదు. కేసులకు బెదరడం లేదు. పొరపాటున ఏసీబీకి దొరికితే దురదృష్టమని సరిపెట్టుకుంటున్నారు. డబ్బులు తీసుకోవడం మాత్రం మానడం లేదు. కొంత మంది అధికారులు అడిగినంత ఇస్తేనే పని చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, నేతల సిఫార్స్‌లున్నా ఎంతోకొంత చేతిలో పడితే తప్ప ఫైలును ముందుకు కదపడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో అడ్డుఅదుపు లేకుండా దండుకొనే ందుకు అలవాటు పడిన రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వం మారినా తీరు మారలేదు. అప్పటి పద్ధతులనే ఇప్పుడూ పాటిస్తున్నారు. మరింత రేటును పెంచేశారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వంలో పని చేసిన గ్రామ స్థాయి అధికారుల నుంచి మండల స్థాయి అధికారుల వరకు పని చేస్తున్నారు. కేవలం తహసీల్దార్‌లను మాత్రమే మార్చారు. డీటీలు, ఆర్‌ఐ, వీఆర్‌ఓలు అత్యధిక శాతం మంది అదే మండలాల్లో పని చేస్తుండడం, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు సహకరిస్తుండ డంతో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు.

- కేసులు నమోదైనప్పటికీ కొన్నాళ్లకు తిరిగి ఉద్యోగం లభిస్తోంది. అంతవరకు అక్రమంగా సంపాదించిన సొమ్ముతో దర్జాగా బతికేస్తున్నారు.

వెంటాడుతున్న భూ సమస్యలు

జిల్లాలో ఇంకా 20శాతం వరకు భూములు ఆన్‌లైన్‌ జరగలేదు. గత వైసీపీ ప్రభుత్వం భూములను రీ సర్వే చేయించింది. సర్వే జరిగిన గ్రామాల్లో అనేక సమస్యలు రైతులను వెంటాడుతున్నాయి. దీనికి తోడు అప్పట్లో ప్రతిపక్షాలకు మద్దతు పలికిన రైతుల జిరాయితీ భూములను ఊద్దేశపూర్వకంగా 22ఏలో చేర్చారు. ఇప్పుడు ఇవన్నీ రెవెన్యూ అధికారులకు ఆదాయం వనరులుగా మారాయి. రెండు దశాబ్దాల క్రితం భూముల కొనుగోలు సమయంలో రిజిస్ట్రేషన్‌ లేకుండా స్టాంప్‌ పేపర్లు, తెల్లకాగితాలపై గ్రామ పెద్దల సమక్షంలో రాయించుకున్నారు. కొంత మంది రిజిస్ట్రేషన్‌ ఖర్చులు తగ్గించుకొనేందుకు ఎకరా భూమిలో అర ఎకరం భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకొని మిగిలిన అర ఎకరం స్వాధీనం చేసుకొనేవారు. ఇలాంటి భూములన్నీ కొనుగోలుదారుని సాగులో ఉన్నప్పటికీ రికార్డులు మాత్రం అమ్మకందారుల పేరున ఉన్నాయి. రిజిస్ట్రేషన్‌ పత్రాలు లేకపోవడంతో రెవెన్యూ అధికారులు ఆన్‌లైన్‌ చేసేందుకు ముందుకు రావడం లేదు. గట్టిగా అడిగితే అవతల పార్టీ కోర్టుకు వెళితే వాటి చుట్టూ తాము తిరగాలా అంటూ ఎదురు తిరుగుతున్నారు. అడిగినంత చేతిలో పెడితే మాత్రం కిమ్మనకుండా మూడో కంటికి తెలియకుండ పని కానిచ్చేస్తున్నారు.

గ్రామ పురోణీలతోనూ ఆదాయం

సాదాబైనామా (గ్రామ పురోణీలు)ల ప్రకారం కొనుగోలు చేసిన భూములకు కూడా ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు. జీవించి ఉన్న తల్లిదండ్రుల భూములు వారసులకు ఆన్‌లైన్‌ చేయడం కుదరదు. దీంతో అమ్మకం జరిగినట్లు వారసుల పేరున రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. ఈ భూములను కొనుగోలు చేసిన వారసులకు పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చేందుకు అధికారులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. చేతిలో చేయి పడితే మాత్రం చిరునవ్వులు చిందిస్తున్నారు. రీ సర్వే జరిగిన గ్రామాల్లో పక్కపక్కనున్న వేర్వేరు రైతులకు చెందిన భూములన్నిటికీ సర్వే నెంబర్‌లకు బదులు ఒకే ఎల్‌పీఎం నెంబర్‌ ఇచ్చారు. ఈ పరిస్థితి క్రయవిక్రయాలకు అడ్డంకిగా మారింది. తిరిగి ఎవరి భూమి వారికి చూపించేలా విడదీయాల్సి వస్తోంది. ఈ రూపంలోనూ రెవెన్యూ అధికారులకు ఆదాయ వస్తోంది.

- ఇక 22-ఏలో నమోదై ఉన్న జిరాయితీ భూముల ఫైల్‌ వస్తే పండగే పండగ. దీన్నించి తప్పించేందుకు పెద్ద మెత్తంలో బేరం కుదిరితేనే ఫైల్‌ ఒకచోట నుంచి మరో చోటుకు నడుస్తుంది.

అవినీతిని ఉపేక్షించేది లేదు

రమ్య, డీఎస్పీ, ఏసీబీ, విజయనగరం

అవినీతిని ఉపేక్షించేది లేదు. ఎంతటివారైనా మినహాయింపులు ఉండవు. సిఫార్సులకు అవకాశం ఉండదు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే సిబ్బంది ప్రజలకు సేవ చేయాలి తప్ప అవినీతికి పాల్పడకూడదు. ప్రజలు ఈ విషయంలో చైతన్యవంతులు కావాలి. ఎవరికీ ఎటువంటి పరిస్థితు ల్లోనూ లంచాలు ఇవ్వద్దు. లంచం అడిగితే టోల్‌ ఫ్రీ నెంబరు 1064, తమశాఖకు చెందిన అధికారుల నెంబర్లకు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు.

---------------------

Updated Date - May 15 , 2025 | 11:51 PM