ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Financial Empowerment మహిళలు ఆర్థికంగా ఎదగాలి

ABN, Publish Date - Jun 17 , 2025 | 11:25 PM

Women Should Achieve Financial Empowerment జిల్లాలోని ప్రతి మహిళా ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో మెప్మా ఆధ్వర్యంలో ఏపీఎంలు, సీవోలు, ఆర్‌పీలతో సమీక్షించారు. ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా పారిశ్రామికవేత్త వచ్చేలా కృషి చేయాలన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

పార్వతీపురం, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రతి మహిళా ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో మెప్మా ఆధ్వర్యంలో ఏపీఎంలు, సీవోలు, ఆర్‌పీలతో సమీక్షించారు. ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా పారిశ్రామికవేత్త వచ్చేలా కృషి చేయాలన్నారు. మహిళలకు జీవనపాధులు కల్పించి వారి ఆదాయాన్ని రెట్టింపు చేయాలని, ప్రతిఒక్కరూ లక్షాధికారి కావాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులతో కొత్త వ్యాపార యూనిట్లను స్థాపించాలన్నారు. కొత్త ఆలోచనలతో వ్యాపారాలను విస్తరించి.. లాభాలు ఆర్జించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వస్త్ర వ్యాపారులు, తినుబండారాలు, ఫ్యాన్సీ షాపులతో పాటు మొబైల్‌ మార్టులు, కాఫీ షాపుల ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందొచ్చన్నారు. సూర్యఘర్‌ పథకంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. యూనిట్‌ ఏర్పాటుతో 28 ఏళ్లు పాటు ఉచితంగా విద్యుత్‌ను పొందొచ్చని వెల్లడించారు.

Updated Date - Jun 17 , 2025 | 11:25 PM