చికిత్స పొందుతూ మహిళ మృతి
ABN, Publish Date - Jul 17 , 2025 | 12:13 AM
మండలంలోని పనసలపాడుకు చెందిన పెదకాపు జయమ్మ(24) చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో మృతి చెందింది.
పాచిపెంట, జూలై 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పనసలపాడుకు చెందిన పెదకాపు జయమ్మ(24) చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో మృతి చెందింది. పాచిపెంట పోలీసుల కథనం మేరకు.. పనసలపాడుకు చెందిన కుంచి జయమ్మకు అదే గ్రామానికి చెందిన పెదకాపు రవితో వివాహం జరిగి ఏడాది కావస్తోంది. మగ బిడ్డ జన్మించ గా, అనారోగ్యం వల్ల బిడ్డ చనిపోయాడు. బిడ్డ చనిపోవడం, ఆర్థిక ఇబ్బం దుల వల్ల జయమ్మ మానసిక క్షోభకు గురైంది. ఈ నేపథ్యం లో ఈనెల ఏడో తేదీన మధ్యాహ్నం జయమ్మ పురుగుల మందు తాగింది. కూలి పనులకు హైదరాబాద్ వెళ్లిన జయమ్మను అక్కడ ఆసుపత్రిలో చేర్పిం చారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. ఈ మేరకు జయమ్మ తల్లి కుంచి సామాలమ్మ మంగళవారం పాచిపెంట పోలీసులకు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కె.వెంకటసురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Jul 17 , 2025 | 12:13 AM