ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గుర్తుతెలియని వాహనం ఢీ: మహిళ మృతి

ABN, Publish Date - May 04 , 2025 | 11:58 PM

రామభద్రపురంలోని కొండ కెంగువ బైపాస్‌ రోడ్డు వద్ద ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ మహిళ మృతి చెందింది.

రామభద్రపురం, మే 4(ఆంధ్రజ్యోతి): రామభద్రపురంలోని కొండ కెంగువ బైపాస్‌ రోడ్డు వద్ద ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ఎస్‌ఐ వెలమల ప్రసాద రావు కథనం మేరకు.. రామభద్రపురంలోని శ్రీరామ్‌నగర్‌ కాలనీకి చెందిన చలమల సత్యవతి (65) కూరగాయల మార్కెట్‌లో వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ మేరకు ఆదివారం తెల్లవారుజామున మార్కెట్‌కు వెళ్తోంది. ఆ సమయంలో కొండకెంగువ బైపాస్‌ రోడ్డులోసాలూరు నుంచి వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్‌సీ కి తరలించారు. భర్త చలమల చిన్నా ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ రమణ కేసు నమోదుచేశారు.

Updated Date - May 04 , 2025 | 11:58 PM