With Dairy Development పాడి అభివృద్ధే లక్ష్యంగా..
ABN, Publish Date - Jul 06 , 2025 | 11:15 PM
With Dairy Development as the Goal జిల్లాలో పశు సంపదను గణనీయంగా పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా మేలు జాతి పెయ్యి దూడలు జన్మించేందుకు వీలుగా సబ్సిడీపై లింగ నిర్ధారణ వీర్యం సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
పాడి రైతులపై ప్రత్యేక దృష్టి
పశు సంపద, పాల ఉత్పత్తి పెంపునకు చర్యలు
జియ్యమ్మవలస, జూలై6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పశు సంపదను గణనీయంగా పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా మేలు జాతి పెయ్యి దూడలు జన్మించేందుకు వీలుగా సబ్సిడీపై లింగ నిర్ధారణ వీర్యం సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పాడి రైతుల వద్ద ఉన్న సంకరి జాతి ఆవులకు ఆ ఇంజక్షన్లు వేయించాలని సూచించింది. వచ్చే ఏడాది మార్చి 31లోగా లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించింది. 2019 లెక్కల ప్రకారం జిల్లాలో పశు సంపద 14.67 లక్షలు. ఇందులో ఆవులు 2.29 లక్షలు, గేదెలు 49 వేలు. అయితే ప్రస్తుతం వాటి సంఖ్య బాగా తగ్గిపోయిందనే అంచనాకు జిల్లా అధికారులు వచ్చారు. ప్రతి జిల్లాల నివేదికను తీసుకున్న ప్రభుత్వం పశు సంపద పెంచి పాడి రైతుల జీవితాల్లో వెలుగులు నింపాలని భావిస్తోంది. ఈ మేరకు ఆవు పెయ్యిలు (ఆడ ఆవులు) జన్మించే విధంగా రూ. 150కే లింగ నిర్ధారిత వీర్య ఇంజక్షన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంది. జిల్లాలో 6,600 ఇంజక్షన్లు వేయించాలని అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం దిశా నిర్దేశం చేసింది. ఇదే వీర్యం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ. 550 పాడి రైతు చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది. ఆవులకు, గేదెలకు కేవలం పెయ్యి దూడలు మాత్రమే పుట్టేందుకు రూపొందించిన లింగ నిర్ధారిత వీర్యం బయట మార్కెట్లో వేలల్లో అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో పశు సంపద, పాల ఉత్పత్తిని పెంచాలనే ఉద్దేశంతో పాడి రైతులకు సబ్సిడీపై కేవలం రూ. 150కే అందించేలాకూ కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దీనికోసం నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌డీడీబీ)తో సంప్రదింపులు చేసింది. రానున్న ఐదేళ్లలో పశువుల్లో స్త్రీ సంపద పెంచి పాల ఉత్పత్తి పెంచి పాడి రైతుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నది ప్రభుత్వ ఆలోచన. తద్వారా సంకర జాతి పశువుల హబ్‌గా జిల్లాను తీర్చిదిద ్దనుంది.
పాడి రైతులకు అవగాహన
వాస్తవంగా ఒక ఆవుకు కచ్చితంగా రెండు ఇంజక్షన్లు వేయాల్సి ఉంటుంది. దీని ద్వారా మేలు రకం సంకర జాతి ఆవుల సంఖ్య పెరుగుతుంది. తద్వారా పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. జిల్లాలో 15 మండలాల పరిధిలో సీతంపేట, పాలకొండ, కురుపాం, గరుగుబిల్లి, పార్వతీపురం, సీతానగరం, సాలూరులో పశు వైద్యశాలలు ఉన్నాయి. వాటి పరిధిలో 38 పశు వైద్య చికి త్సాలయాలు, 35 గ్రామీణ పశువుల యూనిట్లు (ఆర్‌ఎల్‌వో)లు ఉన్నాయి. ఈ 80 ఆసుపత్రులకు అక్కడ పశు సంపదను బట్టి టార్గెట్లు విధించారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారుల నుంచి పశు వైద్యశాలలు, చికిత్సాలయాలు, ఆర్‌ఎల్‌యూలకు మౌఖిక ఆదేశాలు అందాయి. దీంతో పశు వైద్యాధికారులు, సిబ్బంది పాడి రైతులకు పరిస్థితిని తెలియజేస్తున్నారు. పశు సంపద అభివృద్ధికి సహకరించాలని కోరుతూ వారిలో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
పశు వైద్యులను సంప్రదించాలి..
లింగ నిర్ధారిత మేలు జాతి వీర్యం వల్ల ఆడ పెయ్యిలు మాత్రమే పుడతాయి. దీనివల్ల పాడి ఆవులు, పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. తద్వారా పాడి రైతులు కూడా ఆర్థికంగా ఎదుగుతారు. ఇతర వివరాల కోసం పాడి రైతులు సమీపంలోని పశు వైద్యులను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవచ్చు.
- శివ్వాల మన్మథరావు, జాయింట్ డైరెక్టర్, పశు సంవర్థకశాఖ
Updated Date - Jul 06 , 2025 | 11:15 PM