ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘టిడ్కో’కు మోక్షం కలిగేనా?

ABN, Publish Date - Jun 28 , 2025 | 12:38 AM

గత వైసీపీ ప్రభుత్వంలో రాజాంలోని టిడ్కో ఇళ్లకు గ్రహణం పట్టింది. ఐదేళ్ల పాటు వాటి నిర్మాణాన్ని పట్టించుకోలేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో నిర్మాణాలను ప్రారంభించారనే కారణంతో జగన్‌ సర్కారు కక్ష సాధింపునకు పాల్పడింది.

రాజాంలో పూర్తికాని టిడ్కో గృహ నిర్మాణాలు

- పదేళ్లవుతున్నా పూర్తికాని గృహ నిర్మాణాలు

- గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యం

- 768 ఇళ్లను రద్దు చేసిన వైనం

- కూటమి ప్రభుత్వంపైనే లబ్ధిదారుల ఆశలు

రాజాం రూరల్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో రాజాంలోని టిడ్కో ఇళ్లకు గ్రహణం పట్టింది. ఐదేళ్ల పాటు వాటి నిర్మాణాన్ని పట్టించుకోలేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో నిర్మాణాలను ప్రారంభించారనే కారణంతో జగన్‌ సర్కారు కక్ష సాధింపునకు పాల్పడింది. దీంతో లబ్ధిదారులు గృహ యోగానికి నోచుకోలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో టిడ్కో గృహాలకు మోక్షం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాజాం మున్సిపాలిటీకి సంబంధించి టిడ్కో ఇళ్ల కోసం 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం కంచరాం గ్రామ సమీపంలో స్థలాన్ని సేకరించింది. ఇక్కడ 1104 టిడ్కో ఇళ్లు మంజూరు చేసి, నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. మొదటిదశలో 336 ఇళ్ల పనులు ప్రారంభించారు. మొదటి కేటగిరీ కింద ఉచితంగా 96 ఇళ్లు , రెండో కేటగిరీ కింద రూ.50 వేల బ్యాంకు గ్యారెంటీతో 48 ఇళ్లు, మూడో కేటగిరీ కింద రూ.లక్ష బ్యాంకు రుణ సౌకర్యంతో 192 గృహ నిర్మాణాలు చేపట్టారు. 80 శాతం పనులు పూర్తిచేశారు. ఉడ్‌వర్క్‌తో పాటు ఎలక్ట్రికల్‌, చిన్నచిన్న పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ పనులు పూర్తిచేసి లబ్దిదారులకు గృహాలను పంపిణీ చేసే సమయంలో రాష్ట్రంలో 2019లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో పెండింగ్‌ పనులకు బ్రేక్‌ పడింది. తరువాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచే లబ్ధిదారులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. రెండు, మూడు దశల్లో మంజూరు చేసి నిర్మించాల్సిన 768 ఇళ్లను జగన్‌ సర్కారు రద్దు చేసింది. అదే విధంగా మొదటి దశ టిడ్కో ఇళ్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 20శాతం పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసింది. ఐదేళ్ల పాటు వాటిని పూర్తి చేయకపోవడంతో ప్రస్తుతం కొన్ని నిర్మాణాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. టిడ్కో సముదాయ ప్రాంగణం పిచ్చిమొక్కలతో నిండిపోయింది. లక్షలాది రూపాయల విలువచేసే ఐరన్‌, సిమెంట్‌ పోల్స్‌, ఇతరత్రా మెటీరియల్‌ ఎండకు ఎండి వానకు తడిసి పాడైపోతున్నాయి. రద్దు చేసిన 768 ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులు చెల్లించిన సుమారు రూ.కోటి డిపాజిట్‌ మొత్తాన్ని నేటికీ వారికి తిరిగి చెల్లించలేదు. అలాగే వారిలో సుమారు 500 మందికి వైసీపీ ప్రభుత్వం ఇళ్లపట్టాలు ఇచ్చింది. కానీ, స్థలాలు మాత్రం చూపించలేదు. ఇటు ఇళ్లు రాక, అటు ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటికి అద్దె, బ్యాంకు నుంచి తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించలేక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల నుంచి వారిపై ఒత్తిడి పెరిగింది. తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాలని బ్యాంకు అధికారులు డిమాండ్‌ చేస్తుండడంతో ఏమి చేయాలో వారికి తోచడం లేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంపైనే వారు ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ దృషి సారించి తమకు గృహయోగం కల్పించాలని కోరుతున్నారు.

Updated Date - Jun 28 , 2025 | 12:38 AM