ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Will Those Hardships End? ఆ కష్టాలు తొలగేనా?

ABN, Publish Date - May 10 , 2025 | 11:20 PM

Will Those Hardships End? జిల్లాలో శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాలలకు మోక్షం కలగనుంది. భవన నిర్మాణాలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. త్వరలో పనులు జరగనున్నాయి. దీంతో విద్యార్థులకు కష్టాలు తప్పనున్నాయి. చెట్ల కింద చదువులకు ఇక స్వస్తి పలకనున్నారు.

శిథిలావస్థలో కారివలస పాఠశాల
  • భవన నిర్మాణాలకు నిధులు మంజూరు

  • తొలివిడతగా 23 బడుల్లో పనులు

  • గతంలో బిక్కుబిక్కుమంటూ చదువులు

  • దృష్టి సారించని వైసీపీ సర్కారు

గరుగుబిల్లి, మే10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాలలకు మోక్షం కలగనుంది. భవన నిర్మాణాలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. త్వరలో పనులు జరగనున్నాయి. దీంతో విద్యార్థులకు కష్టాలు తప్పనున్నాయి. చెట్ల కింద చదువులకు ఇక స్వస్తి పలకనున్నారు. వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వం శిఽథిల పాఠశాలల వైపు దృష్టి సారించలేదు. కనీసం మరమ్మతు చర్యలు కూడా చేపట్టలేదు. నిబంధనల నెపంతో నిధుల మంజూరులో తీవ్ర జాప్యం చేసింది. మరోవైపు శిథిల భవనాలు ఎప్పుడు కూలుతాయో తెలియక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళన చెందేవారు. వర్షాలు కురిసే సమయంలో అయితే వేరే ప్రాంతాల్లో బడులు నిర్వహించేవారు. చాలా పాఠశాలల్లో వసతి సమస్య నెలకొనడంతో చాలాచోట్ల ఆరుబయట చెట్ల కిందే బోఽధించేవారు. అయితే ఈ సమస్యలను పరిగణనలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయడంపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నిర్మాణాలు ఇలా..

- జిల్లా అధికారుల నివేదికల ఆధారంగా ‘మన్యం’లో 40 పాఠశాలల నిర్మాణాలకు రూ. 5.40 కోట్లు మంజూరయ్యాయి. జిల్లా సమగ్ర శిక్ష అభియాన్‌ నిధులు రూ.13.50 లక్షలతో ఒక్కో పాఠశాల భవనాన్ని నిర్మించనున్నారు. అయితే అడ్వాన్స్‌గా రూ. 2 కోట్లు విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

- సీతంపేట, భామిని, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, గరుగుబిల్లి, పార్వతీపురం, మక్కువ, సాలూరు, పాచిపెంట మండలాల్లోని పాఠశాలలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చారు.

- విద్యార్థుల సంఖ్యను బట్టి నిబంధనల మేరకు ప్రస్తుతం 23 పాఠశాలల్లో పనుల చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. రెండో విడతలో మరో 17 పాఠశాలల్లో అవసరాలను గుర్తించి నిర్మాణాలు చేపట్టనున్నారు.

అవసరమైన పాఠశాలలకు నిధుల మళ్లింపు

- జిల్లాలో కొన్ని పాఠశాలల భవనాలు శిఽథిలావస్థకు చేరకుండానే నిధులు మంజూరయ్యాయి. అయితే వాటి స్థానంలో శిథిలావస్థకు చేరుకున్న వేరే పాఠశాలలకు నిధులు మళ్లించి పనులు చేపట్టనున్నారు.

- గరుగుబిల్లి మండలం సుంకి పాఠశాల భవనం ఉపయోగకరంగా ఉండగా.. దాని స్థానంలో చిలకాం పంచాయతీ కారివలసకు, సీతారాంపురం బదులు శివ్వాం పంచాయతీ సీమలవానివలస పాఠశాలకు నిధులు మళ్లించారు. కొద్ది రోజుల్లో పనులు ప్రారంభం కానున్నాయి. ఎలిమెంటరీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా భవనాలు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు.

- సీతంపేట మండలం వెదుర్లవలసకు బదులుగా సీతంపేట జీపీఎస్‌కు, కొమరాడ మండలం కూనేరు స్థానంలో ఈదులవలసకు, కంబవలసకు బదులుగా రావికోనవలసకు, గుమ్మలక్ష్మీపురం మండలం పుట్టగూడ స్థానంలో ఎల్విన్‌పేటకు, గడ్డికాలనీకి బదులు ఎల్విన్‌పేటకు, కురుపాం మండలం మంటికొండకు బదులు బళ్లుకోటకు, కేసలి స్థానంలో లంకాజోడు, పార్వతీపురం మండలం గంగాపురానికి బదులుగా చందలంగి పాఠశాల భవన నిర్మాణాలకు నిధులు మళ్లించారు.

- పాచిపెంట మండలంలో చెరుకుపల్లి, పనుకువలస, సీతంపేట, కూనబందవలస, తోటవలస పరిధిలో భవనాలు అవసరం లేదని నివేదికలు అందించారు. ఈ ఐదు పాఠశాలల నిధులను ఇంకా మళ్లించలేదు. దీనిపై కలెక్టర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

- మొత్తంగా పది పాఠశాలలకు నిధులు మంజూరైనా భవన నిర్మాణాలు అవసరం లేకపోవడంతో వాటి స్థానంలో మరో పది పాఠశాలలను ఎంపిక చేశారు. వాటికి కలెక్టర్‌ నుంచి అనమతులు రావాల్సి ఉంది.

అనుమతులు రాగానే పనులు

కలెక్టర్‌ నుంచి అనుమతులు రాగానే భవన నిర్మాణాలు ప్రారంభమవుతాయి. మొదటిగా 23 పాఠశాలల్లో పనులు నిర్వహించనున్నాం. వాటికి సంబంధించి రూ. 2.08 కోట్లు అందించనున్నాం. మరో 17 పాఠశాలల్లో అవసరాలను గుర్తించి నిధులు కేటాయించనున్నాం. పాఠశాల భవనాల శిఽథిలావస్థతో పాటు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టనున్నాం.

- రెడ్డి తేజేశ్వరరావు, అసిస్టెంట్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌, జిల్లా సమగ్ర శిక్ష

Updated Date - May 10 , 2025 | 11:20 PM