ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Irrigation Woes End? సాగునీటి ఇక్కట్లు తీరేనా?

ABN, Publish Date - May 10 , 2025 | 11:18 PM

Will the Irrigation Woes End? వీరఘట్టం మండల పరిధిలో తోటపల్లి కాలువలు పిచ్చిమొక్కలతో నిండి అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. మరోవైపు కాలువ గట్లు కూడా పూర్తిగా బలహీనపడ్డాయి. షట్టర్లు శిథిలావస్థకు చేరడంతో నీరు వృథాగా పోతోంది. దీంతో మండలంలో శివారు భూములకు ఏటా సాగునీరు అందడం లేదు.

పిచ్చిమొక్కలతో నిండిన తోటపల్లి కాలువ
  • బలహీనంగా గట్లు .. శిథిలావస్థలో షట్టర్లు

  • శివారుకు అందని నీరు

  • ఏటా రైతులకు తప్పని ఇబ్బందులు

వీరఘట్టం, మే 10(ఆంధ్రజ్యోతి): వీరఘట్టం మండల పరిధిలో తోటపల్లి కాలువలు పిచ్చిమొక్కలతో నిండి అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. మరోవైపు కాలువ గట్లు కూడా పూర్తిగా బలహీనపడ్డాయి. షట్టర్లు శిథిలావస్థకు చేరడంతో నీరు వృథాగా పోతోంది. దీంతో మండలంలో శివారు భూములకు ఏటా సాగునీరు అందడం లేదు. ఖరీఫ్‌, రబీ సీజన్లలో వరుణుడిపైనే ఆధారపడి పంటలు పండించుకోవాల్సి వస్తోంది. వాస్తవంగా గరుగుబిల్లి మండలం తురక నాయుడువలస వద్ద మొదటి బ్రాంచి నుంచి వీరఘట్టం మండల పరిధిలో కొట్టుగుమ్మడ, గడగమ్మ గ్రామాల్లో సుమారు పది వేల ఎకరాలకు తోటపల్లి ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందాల్సి ఉంది. అయితే నడిమికెల్ల, విక్రంపురంలో షట్టర్లు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. ఆయా ప్రాంతాల్లో బ్రిటిష్‌ కాలం నాటి కాలువలు, గట్లు మరమ్మతులకు నోచుకోవడం లేదు. దీంతో శివారున ఉన్న సుమారు 1500 ఎకరాలకు పూర్తిగా నీరందడం లేదు. ఏటాలానే ఈ ఖరీఫ్‌కు కూడా సాగునీటి ఇక్కట్లు తప్పేలా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఉన్నతాధి కారులు స్పందించాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై నీటిపారుదలశాఖ ఏడీ డీవీ రమణను వివరణ కోరగా.. కాలువ మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించామన్నారు. నిధులు మంజూరైన వెంటనే పనులు చేపడతామని తెలిపారు.

Updated Date - May 10 , 2025 | 11:18 PM