ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బుడా లేఅవుట్‌ సాకారమయ్యేనా?

ABN, Publish Date - Jul 06 , 2025 | 11:43 PM

బొబ్బిలి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (బుడా) ఆధ్వర్యంలో మధ్యతరగతి ఆదాయ వర్గాల వారికి (ఎంఐజీ) లేఅవుట్‌ ద్వారా ఇళ్ల స్థలాల విక్రయానికి చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రావడం లేదు.

డొంగురువలస సమీపంలో ఎంఐజీ లేఅవుట్‌ కోసం గుర్తించిన భూమి

బొబ్బిలి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (బుడా) ఆధ్వర్యంలో మధ్యతరగతి ఆదాయ వర్గాల వారికి (ఎంఐజీ) లేఅవుట్‌ ద్వారా ఇళ్ల స్థలాల విక్రయానికి చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రావడం లేదు. సుమారు మూడు నాలుగేళ్ల కాలం గడుస్తున్నప్పటికీ ఇంతవరకు భూసేకరణ ప్ర క్రియ పూర్తి కాలేదు. స్థానిక గ్రోత్‌సెంటరులో తొలుత భూములను గుర్తించినప్పటికీ 50 ఎకరాల భూమికి సాంకేతికపరమైన సమస్యలు తలెత్తడంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. ఆ తర్వాత మున్సిపాలిటీ పరిధిలోని రామన్నదొరవలస సమీపంలో గతంలో ఇళ్ల కాలనీల కోసం గుర్తించిన భూమిని ఎంపిక చేశారు. కానీ కోర్టు కేసు వల్ల సేకరించలేదు. డొంగురువలస గ్రామ సమీపంలో 20 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. ఈ భూమి కూడా కోర్టు కేసు వల్ల ఆగిపోయింది. తాజాగా ఇంకో దగ్గర భూసేకరణ కోసం కసరత్తు ప్రారంభించారు.
డొంగురువలస సమీపంలోనే మరో 50 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమిని ఎంఐజీ కోసం ప్రతిపాదించాలని బుడా భావించింది. అక్కడ 20 ఎకరాలు ప్రభుత్వానిదేనని కోర్టు నిర్ధారించడంతో ఎవరికీ పరిహారం చెల్లించాల్సినవసరం లేదని అధికారులు నిర్ణయానికి వచ్చారు. అయితే భూ యజమానులుగా చెప్పుకుంటున్న వారు మరో కోర్టుకు అప్పీలుకు వెళుతున్నట్లు సమాచారం. మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగులు, మధ్యతరగతి వర్గీయుల సొంత ఇంటి కల నెరవేరేందుకు ఇంకెన్నాళ్లు పడుతుందో ఇదమిద్ధంగా తెలియడం లేదు.
- బుడా పరిధిలో ఆదాయవనరులను పెంచుకునేందుకు షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, ప్రైవేట్‌ లేఅవుట్ల అభివృద్ధి, పెట్రోల్‌ బంకుల నిర్వహణ వంటి కార్యకలాపాలు చేపపట్టాలని నిర్ణయించారు. వాటికి కూడా ఇంతవరకు ఎటువంటి అడుగు పడడం లేదు. దీంతో బుడా వ్యాపార కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యేది ఇంకెప్పుడా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సాలూరులో బుడా పరిధిలో వేసిన ఎంఐజీ లేఅవుట్‌కు మంచి స్పందన రావడంతో అక్కడ లబ్ధిదారులకు లాటరీ ద్వారా స్థలాలు కేటాయించారు. పార్వతీపురంలో అడ్డాపుశీల దగ్గర గుర్తించిన బుడా ఎంఐజీ స్థలానికి ఫీజిబిలిటీ లేని కారణంగా ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. బొబ్బిలిలో స్ధల సేకరణే జరగడం లేదు. ప్రైవేట్‌ స్ధలాలను కొనుగోలు చేసి ఎంఐజీ లేఅవుట్లు వేసే అవకాశం కూడా బుడాకు ఉంది. ఆ వైపుగా ఆలోచన చేయడం లేదు.
ఎంఐజీ లేఅవుట్లు వేస్తాం..
బొబ్బిలి, పార్వతీపురం పట్టణాల్లో ఎంఐజీ లే అవుట్ల ఏర్పాటు కోసం స్థల సేకరణ ప్రక్రియ జరుగుతోంది. ప్రభుత్వ స్థలాలేవీ అందుబాటులో లేని పక్షంలో ప్రైవేట్‌ స్థలాలను కొనుగోలు చేసి మధ్యతరగతి వర్గాల వారికి కేటాయిస్తాం. సాలూరులో వేసిన ఎంఐజీ లేఅవుట్‌ విజయవంతమైంది. అక్కడ మూడు విడతలుగా స్ధలాలను లాటరీద్వారా కేటాయించాం. ఇదే పద్ధతిలో బొబ్బిలి, పార్వతీపురంలో కూడా లేఅవుట్లు వేసేందుకు కృషి జరుగుతోంది.
-తెంటు లక్ష్మునాయుడు, బుడా చైర్మన్‌, బొబ్బిలి

Updated Date - Jul 06 , 2025 | 11:43 PM