ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tax Collections? పన్ను వసూళ్లపై నిర్లక్ష్యమెందుకు?

ABN, Publish Date - Jun 05 , 2025 | 12:04 AM

Why the Negligence in Tax Collections? పంచాయతీల పరిధిలో ఇంటి పన్నుల వసూళ్లపై నిర్లక్ష్యమెందుకుని డివిజనల్‌ పంచాయతీ అధికారి ఎం.నాగభూషణరావు ప్రశ్నించారు. సిబ్బంది తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. లక్ష్యాలను చేరుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సమావేశంలో మాట్లాడుతున్న డివిజనల్‌ పంచాయతీ అధికారి నాగభూషణరావు

గరుగుబిల్లి, జూన్‌4(ఆంధ్రజ్యోతి): పంచాయతీల పరిధిలో ఇంటి పన్నుల వసూళ్లపై నిర్లక్ష్యమెందుకుని డివిజనల్‌ పంచాయతీ అధికారి ఎం.నాగభూషణరావు ప్రశ్నించారు. సిబ్బంది తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. లక్ష్యాలను చేరుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం గరుగుబిల్లి ఎండీపీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ జిల్లా పరిధిలోని 15 మండలాల్లో సుమారు రూ. 2.30 కోట్ల వరకు పన్ను బకాయిలు ఉన్నాయి. పంచాయతీలకు సంబంధించి కార్యదర్శులు పన్నుల వసూళ్లపై శ్రద్ధ చూపడం లేదు. మే నెలాఖరుకు లక్ష్యాలు చేరుకోలేదు. మండలానికి సంబంధించి రూ. 27.57 లక్షలకు గాను రూ. 13.59 లక్షలే వసూలు చేశారు. రెండు రోజుల్లో లక్ష్యాలు చేరుకోలి. గృహాలకు సంబంధించి ఆధార్‌ సీడింగ్‌ ఎసెస్‌మెంట్‌లో వెనుకబడి ఉన్నారు. ఇప్పటివరకు మండలంలో 10,430 గృహాలకు గాను 7,091 ఇళ్లకు మాత్రమే సీడింగ్‌ జరిగింది. గతంలో అక్రమాలు జరిగిన నేపథ్యంలో గృహ యజమానులు చెల్లించిన పన్ను వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తాం.’ అని తెలిపారు. పంచాయతీల పరిధిలో విధులపై అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. గురువారం పంచాయతీ పరిధిలో నిర్వహించే పర్యావరణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. సమన్వయంతో సామూహిక మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఎంపీడీవో ఎల్‌.గోపాలరావు, సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2025 | 12:04 AM