ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

What kind of behavior is this? ఇదేం తీరు!

ABN, Publish Date - Apr 19 , 2025 | 11:08 PM

What kind of behavior is this? సాలూరు మండల పరిధి వివాదాస్పద కొఠియా గ్రూప్‌ గ్రామం ధూళిభద్రలో ఏపీ జల్‌జీవన్‌ మిషన్‌ పనులపై మరోసారి ఒడిశా అధికారులు అక్కసు వెళ్లగక్కారు. జేజేఎంలో భాగంగా నిర్మించిన వాటర్‌ట్యాంక్‌కు రంగులు వేస్తున్న ముగ్గురు కార్మికులను ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకుని పొట్టంగి పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారు.

ఒడిశా కొఠియా పోలీస్‌స్టేషన్‌ ముందు బైఠాయించిన గిరిజనులు

పొట్టంగి స్టేషన్‌కు తరలింపు

ధూళిభద్రలో జేజేఎం పనులు చేపట్టడమే తప్పా?

కొఠియా ఒడిశా పోలీస్‌స్టేషన్‌ ముందు గిరిజనుల బైఠాయింపు

సాలూరు రూరల్‌, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): సాలూరు మండల పరిధి వివాదాస్పద కొఠియా గ్రూప్‌ గ్రామం ధూళిభద్రలో ఏపీ జల్‌జీవన్‌ మిషన్‌ పనులపై మరోసారి ఒడిశా అధికారులు అక్కసు వెళ్లగక్కారు. జేజేఎంలో భాగంగా నిర్మించిన వాటర్‌ట్యాంక్‌కు రంగులు వేస్తున్న ముగ్గురు కార్మికులను ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకుని పొట్టంగి పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారు. దీనిపై స్థానిక గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొటారుబిల్లికి చెందిన పెయింటర్‌ శివ, సహాయకులుగా సాలూరు మండలం ధూళిభద్రకు చెందిన చోడిపల్లి సుబ్బారావు, చోడిపల్లి నర్స్‌లు ధూళిభద్రలో వాటర్‌ ట్యాంక్‌కు శనివారం పెయింటింగ్‌ పనులు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఒడిశా రాష్ట్రం పొట్టంగి రెవిన్యూ, సమితి అధికారులు ఒడిశా పోలీసులతో అక్కడకు వెళ్లి వారిని తీసుకెళ్లిపోయారు. దీంతో ధూళిభద్ర, ఎగువశెంబి, దిగువశెంబి గిరిజనులు ఒడిశాకు చెందిన కొఠియా పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. తమ వారిని ఎందుకు నిర్బంధించి.. పొట్టంగి పోలీస్‌స్టేషనుకు తరలించారని ప్రశ్నించారు. తమ వారిని విడిచిపెట్టేవరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. రాత్రి ఎనిమిది గంటల వరకు గిరిజనులు కొఠియా ఒడిశా పోలీస్‌స్టేషన్‌ నుంచి కదలలేదు. గంజాయిభద్ర గిరిజన నేతలు గెమ్మెల బీసు, రాజేష్‌ తదితరులు పొట్టంగి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులతో మాట్లాడారు. మరోవైపు ఏపీకి చెందిన కొఠియా పోలీసులు ఒడిశా కొఠియా పోలీసుస్టేషన్‌కు వెళ్లి అక్కడి వారితో చర్చించారు. ఒడిశా అధికారులు సైతం అక్కడ పరిస్థితిని కోరాపుట్‌ జిల్లా ఉన్నతాధికారులకు వివరించారు. పొట్టంగి పోలీస్‌స్టేషన్‌ నుంచి వారి తీసుకురావడానికి కొఠియా నుంచి ముగ్గురు బైక్‌లపై వెళ్లారు. మరోవైపు రాత్రయినా ఏపీ కొఠియా పోలీసులు అక్కడే వేచి ఉన్నారు. అనంతరం ముగ్గురు కార్మికులనూ విడుదల చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - Apr 19 , 2025 | 11:08 PM