ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

What is bogus situation బోగస్‌ పని పట్టరేమి?

ABN, Publish Date - Jun 20 , 2025 | 12:02 AM

What is bogus situation వయసు పైబడకపోయినా.. అవయవాలన్నీ బాగున్నా కూడా అడ్డదారిలో ధ్రువపత్రాల్ని పొంది సంవత్సరాలుగా పింఛన్‌ తీసుకుంటున్న వారిపై ప్రభుత్వం మొదట్లో సీరియస్‌ అయింది. వైద్య తనిఖీలకు ఆదేశించింది. శిబిరాలు ఏర్పాటు చేసి బోగస్‌ లబ్ధిదారులను గుర్తించింది. ఇది జరిగి ఆరు నెలలు అవుతున్నా చర్యలు లేవు. అక్రమాలు గుర్తించినా నేటికీ బోగస్‌ లబ్ధిదారులు దర్జాగా పింఛను తీసుకుంటున్నారు. దివ్యాంగ పింఛన్ల రూపంలోనే ఎక్కువ అక్రమాలు కొనసాగుతున్నాయి.

బోగస్‌ పని పట్టరేమి?

పింఛన్లలో అనర్హులకు పెద్దపీట

వైసీపీ హయాంలో అడ్డగోలుగా దోపిడీ

వైద్య తనిఖీల్లో గుర్తింపు

ఆరు నెలలు అవుతున్నా చర్యలు శూన్యం

వయసు పైబడకపోయినా.. అవయవాలన్నీ బాగున్నా కూడా అడ్డదారిలో ధ్రువపత్రాల్ని పొంది సంవత్సరాలుగా పింఛన్‌ తీసుకుంటున్న వారిపై ప్రభుత్వం మొదట్లో సీరియస్‌ అయింది. వైద్య తనిఖీలకు ఆదేశించింది. శిబిరాలు ఏర్పాటు చేసి బోగస్‌ లబ్ధిదారులను గుర్తించింది. ఇది జరిగి ఆరు నెలలు అవుతున్నా చర్యలు లేవు. అక్రమాలు గుర్తించినా నేటికీ బోగస్‌ లబ్ధిదారులు దర్జాగా పింఛను తీసుకుంటున్నారు. దివ్యాంగ పింఛన్ల రూపంలోనే ఎక్కువ అక్రమాలు కొనసాగుతున్నాయి.

రాజాం, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి):

కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలుచేస్తోంది. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక పింఛన్ల మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచింది. దివ్యాంగులకు సంబంధించి మూడు విభాగాల్లో రూ.6, రూ.10, రూ.15 వేలు అందిస్తోంది. అయితే బోగస్‌ పింఛన్లకు మాత్రం ఇంతవరకూ బ్రేక్‌ పడలేదు. ప్రతి గ్రామంలో పదుల సంఖ్యలో బోగస్‌ పింఛన్లు ఉన్నాయి. ముఖ్యంగా దివ్యాంగ పింఛన్ల రూపంలోనే ఎక్కువగా అక్రమాలు కొనసాగుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఈ బోగస్‌ పింఛన్ల విషయంలో అడ్డుకట్ట పడకపోవడం విమర్శలకు తావిస్తోంది.

తనిఖీ జరిగి ఆరు నెలలు..

వృద్ధులకు రూ.4 వేల చొప్పున పింఛన్‌ అందుతుండగా దివ్యాంగులకు రూ.6 వేలు.. కండరాల బలహీనత, పక్షవాతం తదితర రుగ్మతలతో బాధపడుతున్నవారికి రూ.10 వేలు, దీర్ఘకాలిక వ్యాధులకు గురై మంచం పట్టిన వారికి రూ.15 వేలకు ప్రభుత్వం పింఛను మొత్తాన్ని పెంచి అందిస్తోంది. జిల్లాలో మంచానికే పరిమితమైనవారు 342 మంది ఉన్నారు. వీరి ఇంటికి వెళ్లి వైద్య బృందం ఇప్పటికే తనిఖీలు పూర్తిచేసింది. ఇందుకుగాను ఇతర జిల్లాలకు చెందిన వైద్యుల బృందాన్ని నియమించింది. వీరి పరిశీలన పూర్తిచేసింది. ఒక ఆర్థోపెడిక్‌ వైద్యుడు, జనరల్‌ ఫిజీషియన్‌తో పాటు స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారితో కూడిన బృందం వెళ్లి పరిశీలించింది. కాగా జిల్లాలో రూ.6 వేలు పింఛన్‌ మొత్తాన్ని అందుకుంటున్న దివ్యాంగుల సంఖ్య 36,974. వీరికి సైతం జనవరి మొదటి వారం నుంచి ప్రారంభమైన ప్రక్రియ పూర్తయ్యింది. ఆరు నెలలు అవుతున్నా ఇంతవరకూ దివ్యాంగుల పింఛన్లలో బోగస్‌కు అడ్డుకట్టపడకపోవడం గమనార్హం.

తప్పుడు ధ్రువపత్రాలతో..

జిల్లా వ్యాప్తంగా అన్నిరకాల సామాజిక పింఛన్‌ లబ్ధిదారులు 2,73,083 మంది ఉన్నారు. అయితే చాలామంది తప్పుడు ధ్రువపత్రాలతో పింఛన్లు పొందుతున్నట్టు తేలింది. అప్పట్లో ఆధార్‌లో తప్పుడు వయసు చూపి చాలా మంది వృద్ధాప్య పింఛన్లు పొందారు. వైసీపీ హయాంలో చోటా నేతలే సదరం సర్టిఫికెట్ల విషయంలో సూత్రధారులుగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వైద్యాధికారులతో కుమ్మకై లబ్ధిదారుల వద్ద వేలాది రూపాయలు వసూలు చేసినట్టు ఈ ప్రభుత్వం గుర్తించింది. అయినా బోగస్‌ పింఛన్లకు బ్రేక్‌ పడకపోవడంపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పింఛన్‌ మొత్తాన్ని పెంచింది. ఇటీవల భర్తలు చనిపోయిన వారికి స్పౌజ్‌ కోటా కింద పింఛన్లు ఇచ్చింది. కానీ బోగస్‌ పింఛన్‌దారులకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతోంది.

సీఎం ప్రకటనతో టెన్షన్‌

మొన్న ఆ మధ్య సీఎం చంద్రబాబు బోగస్‌ పింఛన్లపై గట్టి ప్రకటనలే చేశారు. తప్పుడు ధ్రవీకరణ పత్రాలతో పింఛన్‌ అందుకున్న వారి నుంచి నగదు రికవరీ చేస్తామని స్పష్టం చేశారు. వాటిని మంజూరు చేసిన వైద్యులపైనా కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. దీంతో బోగస్‌ పింఛన్‌దారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. అటు వైద్యులు సైతం ఆందోళన చెందారు. కానీ నెలలు గడుస్తున్నా వారిపై చర్యలు లేవు. బోగస్‌ పింఛన్ల నిలిపివేత జరగలేదు.

Updated Date - Jun 20 , 2025 | 12:02 AM