ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Intermediate Supplementary Exams పకడ్బందీగా ఇంటర్‌ సప్లిమెంటరీ

ABN, First Publish Date - 2025-05-05T23:42:29+05:30

"Well-Organized Intermediate Supplementary Exams జిల్లాలో ఈ నెల 12 నుంచి 20 వరకు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో కె.హేమలత ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు.

సమావేశంలో మాట్లాడుతున్న డీఆర్వో హేమలత

  • 12 నుంచి 29 వరకు పరీక్షలు

  • డీఆర్వో హేమలత

పార్వతీపురం, మే 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ నెల 12 నుంచి 20 వరకు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో కె.హేమలత ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు ఒకేషనల్‌, జనరల్‌ గ్రూప్‌ల నుంచి 4,914 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి ఇంటర్‌, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. పూర్తిస్థాయిలో ఆర్టీసీ బస్సులు నడపాలి. నిరంతర విద్యుత్‌, తాగునీరు, మౌలిక వసతుల ఏర్పాట్లు చేయాలి. కేంద్రాల వద్ద పోలీస్‌ బందోబస్తు తప్పనిసరి. ఓఆర్‌ఎస్‌, ప్రథమ చికిత్స సేవలు అందుబాటులో ఉండాలి. అధికారులు సెల్‌ఫోన్లు వాడరాదు. 144 సెక్షన్‌ అమలు చేయాలి.’ అని తెలిపారు. జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖాధికారి డి.మంజులవీణ మాట్లాడుతూ.. ఇంటర్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలోనే ప్రథమ స్థానంలో నిలిచారని వెల్లడించారు. సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Updated Date - 2025-05-05T23:42:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising