నగర పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తాం
ABN, Publish Date - Jul 30 , 2025 | 12:17 AM
నగర పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే లోకం నాగమాధవి, మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు అన్నారు.
ఎమ్మెల్యే నాగమాధవి, మార్క్‌ఫెడ్ చైర్మన్ బంగార్రాజు
కౌన్సిల్ సమావేశంలో సమస్యలపై ధ్వజమెత్తిన సభ్యులు
నెల్లిమర్ల, జూలై 29(ఆంధ్రజ్యోతి): నగర పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే లోకం నాగమాధవి, మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు అన్నారు. మంగళవారం స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో చైర్‌పర్సన్ బంగారు సరోజిని అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశానికి వారు అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో విద్యుత్ దీపాలు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, లోఓల్టేజీ సమస్యలపై కౌన్సిల్ సభ్యులు ధ్వజమెత్తారు. నగర పంచాయతీలో తాగునీటి కొరత నెలకొందని, అసలు ఎన్ని ట్యాంకుల ద్వారా తాగునీరు సరఫరా చేశారో లెక్కతేల్చి చెప్పాలని టీడీపీ నాయకుడు లెంక అప్పల నాయుడు డిమాండ్ చేశారు. దీంతో వాటర్ ట్యాంకుల నిర్వహణ కు రూ.53వేల ఖర్చుకు సంబంధిం చి ఎజెండా అంశాన్ని తొలగించా రు. వీధి దీపాల ఏర్పాటు నిర్వహ ణకు రూ.4లక్షల 98వేలు ఖర్చు ప్రతిపాదన పెడుతున్నట్టు అధికా రులు చెబుతుండగా.. అసలు వీధిలైట్లు వెలగడం లేదని, లో ఓల్టేజీతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని, తిరిగి కొత్త ప్రతిపాదనలు ఎలా చేస్తారని 16వ వార్డు జనసే న నాయకుడు పాండ్రంకి సత్యనారాయణ ప్రశ్నించారు. ఇలా వివిధ సమస్యలపై సభ్యులు ధ్వజమెత్తారు. దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ సభ్యులు తెలిపిన సమస్యలపై దృష్టి సారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇంటింటి కుళాయి పథకానికి డిపాజిట్ చెల్లించకుండా తాగునీటిని వాడుకుంటున్న యజమానులు రూ.11వేల డిపాజిట్‌ను మూడు వాయిదాలలో చెల్లించేందుకు ఆమోదిస్తూ తీర్మానించారు. ఈ సమావేశంలో కమిషనర్ టి.జయరాం, వైస్ చైర్మన్‌లు సముద్రపు రామారావు, కారుకొండ కృష్ణ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Updated Date - Jul 30 , 2025 | 12:17 AM