అర్హులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే
ABN, Publish Date - May 24 , 2025 | 11:30 PM
:ప్రభుత్వంఅర్హులైన వారిని అన్నివిధాలా ఆదుకుంటుదని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకంనాగ మాధవి తెలిపారు. శనివారం ముంజేరులోని జనసేన పార్టీ కార్యాలయంలో నెల్లిమర్ల నియోజకవర్గంలో అనా రోగ్యంతో బాధపడుతున్న నలుగురికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూ రైన రూ.4.73 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
భోగాపురం,మే24(ఆంధ్రజ్యోతి):ప్రభుత్వంఅర్హులైన వారిని అన్నివిధాలా ఆదుకుంటుదని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకంనాగ మాధవి తెలిపారు. శనివారం ముంజేరులోని జనసేన పార్టీ కార్యాలయంలో నెల్లిమర్ల నియోజకవర్గంలో అనా రోగ్యంతో బాధపడుతున్న నలుగురికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూ రైన రూ.4.73 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధితులకు సకాలంలో ఆర్థిక సహాయం అందించడం ద్వారా ప్రభుత్వం ఆరోగ్య సంక్షేమానికి అంకితమయ్యిందన్నారు. కాగా పూసపాటిరేగ మండలంలోని తిప్పలవలసకు చెందిన 100 మంది వైస్ సర్పంచ్ కేశం అరుణ ఆధ్వర్యంలో ముంజేరు పార్టీ కార్యాలయంలో లోకంనాగమాధవి సమక్షంలో జనసేనలో చేరారు. కార్యక్రమంలో కేశం అమర్నాధ్, జయరాజు, శివ పాల్గొన్నారు.
నిందితులపై చర్యలు తీసుకోవాలి
నెల్లిమర్ల, మే 24 (ఆంధ్రజ్యోతి): జనసేన కార్యకర్తలపై దాడిచేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే లోకం నాగమాధవి డిమాండ్‌చేశారు. మండలంలోని కొత్తపేటలో వైసీపీ, జనసేన వర్గీయుల మధ్య జరిగిన కొట్లాటలో గాయపడి మిమ్స్‌లో చికిత్సపొందుతున్న జనసేన కార్యకర్తలను ఎమ్మెల్యే లోకం నాగమాధవి శుక్రవారం రాత్రి పరామర్శించారు. ఈ ఘటనలో ఆ గ్రామానికి చెందిన జనసేననాయకులు సువ్వాని రమణతోపాటు మరో ముగ్గురు గాయపడ్డారు. అలాగే జనసేననాయకులు చనమల్లు వెంకటరమణ, కరుమజ్జి గోవిందరావు,అంబళ్ల అప్పలనాయుడు, యడ్ల గోవిందరావు క్షతగాల్రను పరామర్శించారు.
Updated Date - May 24 , 2025 | 11:30 PM