ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

information system సమాచార వ్యవస్థను బలోపేతం చేస్తాం

ABN, Publish Date - Apr 07 , 2025 | 11:29 PM

We will strengthen the information system అగ్నిమాపక కేంద్రాల్లో సమాచార వ్యవస్థను బలోపేతం చేస్తామని విపత్తుల, అగ్నిమాపకశాఖ రాష్ట్ర అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జి. శ్రీనివాసులు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో అగ్నిమాపక కేంద్రాన్ని పరిశీలించారు.

అగ్నిమాపక సిబ్బందికి సూచనలు ఇస్తున్న ఏడీ శ్రీనివాసులు

పార్వతీపురం టౌన్‌/ బెలగాం, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి) : అగ్నిమాపక కేంద్రాల్లో సమాచార వ్యవస్థను బలోపేతం చేస్తామని విపత్తుల, అగ్నిమాపకశాఖ రాష్ట్ర అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జి. శ్రీనివాసులు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో అగ్నిమాపక కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 250 కోట్లతో రాష్ట్రంలోని అగ్నిమాపక కేంద్రాల ఆధునికీకరణకు త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. పార్వతీపురం, పాలకొండ భవనాల పనులకు రూ.2.5 కోట్ల చొప్పున కేటాయించినట్లు వెల్లడించారు. శాటిలైట్‌ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రూ.5 కోట్లు విలువ చేసే హజ్మత్‌ వాహనంతో పాటు రూ.3 కోట్లుతో బ్రీతింగ్‌ ఆపరేటవ్‌ సిస్టమ్‌ను సిద్ధంగా ఉంచామని చెప్పారు. పుష్‌టాక్‌ సెల్యూలర్‌ వాకీటాకీ స్టేషన్లతో పాటు కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఘటనా స్థలాలకు అత్యంత వేగంగా చేరుకునేందుకు గాను రెస్క్యూ టీమ్‌లకు ప్రత్యేక శిక్షణ అందించనున్నామని స్పష్టం చేశారు. సిబ్బంది కొరత ఉంది కానీ త్వరలోనే పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఆర్‌ఎఫ్‌వో రంజన్‌ రెడ్డి, డీఎఫ్‌వో శ్రీనుబాబు, అగ్నిమాపక అధికారి ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2025 | 11:29 PM