గిజబ గ్రామస్థులకు న్యాయం చేస్తాం
ABN, Publish Date - Apr 24 , 2025 | 12:14 AM
:చేపల చెరువు సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి గిజబ గ్రామస్థులకు న్యాయం చేస్తామని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి హామీ ఇచ్చారు. బుధవారం తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురైన గిజబ పునరావాస ప్రాం తాన్ని పరిశీలించారు.
గరుగుబిల్లి, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి):చేపల చెరువు సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి గిజబ గ్రామస్థులకు న్యాయం చేస్తామని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి హామీ ఇచ్చారు. బుధవారం తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురైన గిజబ పునరావాస ప్రాం తాన్ని పరిశీలించారు. గ్రామానికి ఆనుకుని ఏర్పాటు చేసిన చేపల చెరువు తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆమె దృష్టికి ఎంపీటీసీ ఎం.సింహా చలంనాయుడుతోపాటు పలువురు గ్రామస్థులు ఇటీవల తీసుకువెళ్లిన విషయంవిదితమే. ఈమేరకు చెరువు పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె చేపలచెరువుతో అసౌకర్యం నెలకొన్న విషయాన్ని గుర్తిం చారు. చెరువు ప్రాంతాన్ని మార్పు చేసేందుకు అవసరమైన చర్యలు చేపడ తామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీప్రతినిధులు ఎ.మధుసూదనరావు, డి.రామకృష్ణ, రాంబాబు, ఎం.పురుషోత్తంనాయుడు, ఎం.తవిటినాయుడు, విజయవాంకుశం,పకీరునాయుడు, రాంబాబు, శంకరరావు పాల్గొన్నారు.
Updated Date - Apr 24 , 2025 | 12:14 AM