ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సంచరిస్తూ.. సంతతి పెంచుకుంటూ..

ABN, Publish Date - Jun 16 , 2025 | 11:59 PM

ఉమ్మడి విజయనగరం జిల్లాను ఏనుగులు వదలడం లేదు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ అటవీ సరిహద్దు ప్రాంతాల నుంచి మూడేళ్ల కిందట ఆహారం కోసం ఈ ప్రాంతానికి వచ్చిన ఏనుగులు ఇక్కడే తిష్ఠవేశాయి.

ముుత్తాయివలస తోటల్లో సంచరిస్తున్న ఏనుగులు

-మూడేళ్లలో నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన ఏనుగులు

- వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న వైనం

- ప్రస్తుతం ముత్తాయివలస మామిడి తోటల్లో తిష్ఠ

బొబ్బిలి/సీతానగరం, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి విజయనగరం జిల్లాను ఏనుగులు వదలడం లేదు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ అటవీ సరిహద్దు ప్రాంతాల నుంచి మూడేళ్ల కిందట ఆహారం కోసం ఈ ప్రాంతానికి వచ్చిన ఏనుగులు ఇక్కడే తిష్ఠవేశాయి. జనావాసాల మధ్య సంచరిస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ఏనుగుల దాడుల్లో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఒంటరిగా బయటకు వెళ్లలేకపోతున్నారు. రైతులు పొలాలకు వెళ్లేందుకు కూడా సాహసించడం లేదు. ఇదిలాఉండగా, ఉమ్మడి జిల్లాలో సంచరిస్తున్న ఏనుగులు తమ సంతతిని పెంచుకుంటున్నాయి. బొబ్బిలి మండలం ముత్తాయివలస తోటల్లో ప్రస్తుతం గజరాజులు తిష్ఠవేశాయి. ఇక్కడ 9 ఏనుగులు సంచరిస్తున్నాయి. వాటిలో పెద్ద ఏనుగులు ఆరు, పిల్ల ఏనుగులు మూడు ఉన్నాయి. బస చేసిన ప్రాంతాల్లోనే అవి పిల్లలను కంటున్నాయి. కొమరాడ మండలం దుగ్గు గ్రామంలో ఒకటి, గుమ్మలక్ష్మీపురం మండలం వెంకటాపురం, వంగర మండలం కోదులు గుమడ, సీతానగరం మండలం కోటసీతారాంపురం గ్రామంలో మూడు పిల్లలను కన్నాయి. మూడేళ్లలో మొత్తం నాలుగు ఏనుగు పిల్లలకు జన్మనిచ్చాయి.

పిల్లలకు కాపలా..

ఇన్నాళ్లు పార్వతీపురం మన్యం జిల్లాలో కనిపించిన ఏనుగులు ప్రస్తుతం బొబ్బిలి మండలానికి చేరుకున్నాయి. మూడు రోజులుగా ముత్తాయివలస గ్రామ మామిడి తోటల్లో సంచరిస్తున్నాయి. తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాయి. ఇటీవల జన్మించిన గున్న ఏనుగు నడవలేక ఇబ్బంది పడుతుండడంతో పెద్ద ఏనుగులు దానికి రక్షణగా నిలుస్తున్నాయి. అప్పుడప్పుడు తప్పిపోతున్న పిల్ల ఏనుగులు మళ్లీ ఆ గుంపులో చేరడానికి నానా అవస్థలు పడుతున్నాయి. ఏనుగు పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండేందుకు గన్‌షూట్‌తో వాటికి ఇంజక్షన్లు చేస్తున్నట్లు అటవీశాఖ సిబ్బంది చెబుతున్నారు. ఉపాధి హామీ పథకంలో పంట పొల్లాల్లో తవ్విన ఇంకుడు గుంతల్లో ఇటీవల వర్షాలకు బాగా నీరు చేరింది. ఈ నీటితో ఏనుగులు తమ దాహార్తిని తీర్చుకుంటున్నాయి. ఈ ఏడాది మేలో వర్షాలు కురిసి కాస్త వాతావరణంలో వేడి తగ్గడంతో అదృష్టవశాత్తూ ఏనుగుల నుంచి పెద్ద అపాయం తప్పినట్లుగా అందరూ భావిస్తున్నారు. కాగా, ముత్తాయివలస మామిడి తోటల్లో ఉంటున్న ఏనుగులను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. వాటితో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడుతున్నారు. వారిని అదుపు చేసేందుకు అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు కష్టపడాల్సి వస్తోంది. గజరాజులను కవ్విస్తే జనం మీదకి తిరగబడతాయని వారు హెచ్చరిస్తున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఏనుగుల గుంపును చూసి వాటితో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడుతున్న జనాన్ని హెచ్చరిస్తూ స్థానిక ఎమ్మెల్యే బేబీనాయన సోమవారం వాయిస్‌ మెసేజ్‌ విడుదల చేశారు. ‘అవి అడవి జంతువులు. పెంపుడవి, శిక్షణ ఇచ్చినవి కావు. వాటి దగ్గరకు పొరపాటున కూడా వెళ్లరాదు. వాటి మానసికి స్థితికి భంగం కలిగిస్తే అవి రెచ్చిపోయి తిరగబడతాయి. అఅపాయం కలిగించడానికి కూడా వెనుకాడవు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనించి అప్రమత్తంగా ఉండాలి. అధికారులకు అందరూ సహకరించాలి. వాటి మనుగడ, ఉనికికి ఇబ్బంది కలుగజేసి ఎవరూ ఇబ్బందులకు గురికావద్దు.’అని ఎమ్మెల్యే హెచ్చరించారు.

Updated Date - Jun 16 , 2025 | 11:59 PM