జిల్లాలో విజన్ ప్లాన్ కార్యాలయాలు
ABN, Publish Date - Jun 07 , 2025 | 11:33 PM
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా రూపొందించిన విజన్ ప్లాన్ (దార్శనిక పత్రం ) అమలు కోసం అన్ని నియోజకవర్గాలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక కార్యాలయాలను సోమవారం ప్రారంభించనున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు.
-రేపు నియోజకవర్గ కేంద్రాల్లో ప్రారంభం
విజయనగరం కలెక్టరేట్, జూన్ 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా రూపొందించిన విజన్ ప్లాన్ (దార్శనిక పత్రం ) అమలు కోసం అన్ని నియోజకవర్గాలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక కార్యాలయాలను సోమవారం ప్రారంభించనున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. శనివారం ఎంపీడీవోలు, మండల ప్రత్యేకాధి కారులు, జిల్లా అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నియోజకవర్గ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో విజన్ ప్లాన్ కార్యాలయాలు ఏర్పాట వుతాయని తెలిపారు. వీటిని సంబంధిత ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారని చెప్పారు. ఎమ్మెల్యేలు అధ్యక్షులుగా, ఎమ్మెల్సీలు, మున్సిపల్ చైర్‌పర్సన్, ఎంపీడీవోలు కన్వీనర్‌లుగా వ్యవహరిస్తారని అన్నారు. ఈ కార్యాలయాల ద్వారా ఆయా నియోజకవర్గాల విజన్ ప్లాన్ కార్యాచరణ అమలును పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ఇక్కడ పనిచేసేందుకు ఐదుగురు సిబ్బందిని ఇప్ప టికే కేటాయించామని చెప్పారు. కార్యాలయ ప్రారంభోత్సవ అనంతరం సీఎం చంద్రబాబు అమరావతి నుంచి నేరుగా నియోజకవర్గ విజన్ ప్లాన్ అమలుపై నియమితులైన కమిటీలతో ఆన్‌లైన్‌లో ముఖాముఖి నిర్వహి స్తారని తెలిపారు. రూ.105 కోట్లు విలువైన 416 పనులను ప్రారంభిం చేందుకు, శంకుస్థాపనలు చేసేందుకు గుర్తించినట్లు చెప్పారు.
Updated Date - Jun 07 , 2025 | 11:33 PM