విశాఖ రైల్వే జోన్ ప్రక్రియ వేగవంతం: ఎంపీ
ABN, Publish Date - Jun 08 , 2025 | 12:09 AM
విశాఖ రైల్వేజోన్ ప్రక్రియ మరింత వేగవంతం కానుందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. రైల్వేజోన్‌కి సంబం ధించి జీఎంని నియమించడం హర్షణీ యమన్నారు. శనివారం పార్టీ కార్యాలయం (అశోక్ బంగ్లా)లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
విజయనగరం రూరల్/రాజాం, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): విశాఖ రైల్వేజోన్ ప్రక్రియ మరింత వేగవంతం కానుందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. రైల్వేజోన్‌కి సంబం ధించి జీఎంని నియమించడం హర్షణీ యమన్నారు. శనివారం పార్టీ కార్యాలయం (అశోక్ బంగ్లా)లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉత్తరాంధ్రకు జోన్ కేటాయించడం పట్ల ప్రధాని మోదీకి, ఈ విషయంలో ఎంతో కృషి చేసిన సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. 2019 నుంచి 2024 వరకూ అధికారం వెలగబెట్టిన వైసీపీ రైల్వే జోన్ గురించి, ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి పట్టించుకోలేదన్నారు. ఉత్తరాంధ్రలో వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తూనే, మరోవెపు పారిశ్రామికంగా అభివృద్ది చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. కరోనా ఉందని మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి చెబుతున్నారని.. అలాంటపుడు వెన్నుపోటు నిరసనలు ఎలా చేశారని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, ప్రసాదుల ప్రసాద్, కర్రోతు నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
మంచి రోజులు..
లక్కవరపుకోట, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటన అనంతరం జీఎంను నియమించడం శుభపరిణామమని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. శనివారం తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడంతో రాష్ట్రానికి కావాల్సిన నిధులను చంద్రబాబు నాయకత్వంలో సాధిస్తున్నామని తెలిపారు. రూ.149 కోట్లతో రైల్వేజోన్ కార్యాలయాన్ని 9 అంతస్తులతో నిర్మించనున్నట్టు చెప్పారు. దీంతో ఉత్తరాంధ్ర అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రూ.75వేల కోట్లతో జాతీయ రహదారులు, రూ.72 వేల కోట్లతో రైల్వే లైను నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అయిదేళ్లలో రైల్వేజోన్ కోసం ప్రయత్నించలేదని విమర్శిం చారు. 54 ఎకరాలు కేటాయించ లేకపోయిందని విమర్శించారు. ఏడాదిలో కేంద్రం సాయంతో అనేక కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ఈ సమావేశంలో చొక్కాకుల మల్లు నాయుడు, జీఎస్ నాయుడు, రాయవరపు చంద్రశేఖర్, రత్నాజీ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 08 , 2025 | 12:09 AM